ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
దేవరకద్ర / నేటి ధాత్రి
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ… గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6000 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తూ..ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు, ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మొదటి సారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 26వ తేదీన అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
అంతేకాక గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చేయలేని పనులు దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, కోర్టు, 100 పడకల ఆస్పత్రి, దేవరకద్ర మున్సిపాలిటీ గా చేయడం, చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఇంటర్ కాలేజ్ తదితర హామీలను ప్రభుత్వం ఏర్పడ సంవత్సర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేశామని, చిన్న చింతకుంట మండలం ధమగ్నాపూర్ గ్రామంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కురుమూర్తి దేవస్థానం వద్ద రూ. 110 కోట్లతో ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అనంతరం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, గ్రామపంచాయతీ నూతన భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.