*రాజధాని అమరావతి నిర్మాణ స్ఫూర్తితో తుడా ను అభివృద్ధి చేస్తున్నాము..
*తుడా పరిధిలో ప్రతి గ్రామానికి రోడ్లు, త్రాగునిరు, డ్రైన్స్ అందిస్తాం..
*గత పాలకులు తుడాను బ్రష్టుపట్టించారు..
*లేవుట్స్ అనుమతులు సరళతారం చేస్తున్నాము..
*అక్రమ లేవుట్ లు, అనుమతులు లేని భవన నిర్మాణాలు పంచాయితీ కార్యదర్శులు గుర్తుంచాలి..
*సమాజ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులది కీలకపాత్ర..
*తుడా చైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి నేటి ధాత్రి
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబులు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారి శ్రమలో భాగం పంచుకోవాలన్న సంకల్పంతో తాను తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తుడా పరిధిలో ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నానని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు.
తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తుడా పరిధిలో లేవుట్ అప్రూవల్, భవన నిర్మాణాల అనుమతులు, అమలు తదితర అంశాల పై గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 4 మున్సిపాలిటీలు,9 నియోజకవర్గాలు,39 మండలాల ఎంపిడిఓ లు, 1100 పైగా గ్రామపంచాయతీల కార్యదర్సులకు అవగాహన సదస్సు బుధవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారుజిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సురేష్ నాయుడు,
తుడా సెక్రటరీ శ్రీకాంత్, తదితరులు హాజరయ్యారుఈ సందర్భంగా తుడా సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవీ కుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీ పరిధిలో కార్యదర్శులు అక్రమ లేఅవుట్లు ఎలా గుర్తించాలి, ఎలా అనుమతులు ఇవ్వాలి. భవన నిర్మాణాల అనుమతులు తదితర అంశాలను కులం కుశంగా వివరించారు. అదేవిధంగా పంచాయితీ కార్యదర్సుల అనుమానలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి శ్రీవారి దర్శనర్థం ప్రతిరోజూ లక్షలాదిమంది ప్రజలు వస్తున్నారని వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా దైవదర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేవిధంగా అన్ని సౌకర్యాలు తుడా కల్పిస్తుందని స్వష్టం చేశారు.
సి ఆర్ డి ఏ,
పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణం సరవెగంగా జరుగుతోంది దానిని స్ఫూర్తిగా తీసుకోని తుడా పరిధిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, కట్టపడుతున్నారని వారి కష్టంలో భాగం కావాలన్న సంకల్పంతో తుడా అభివృద్ధికి కష్టపడుతున్నామన్నారు. గత పాలకులు తుడాను బ్రష్టుపట్టించారాని మండిపడ్డారు. తాను తుడా ఛైర్మెన్ అయ్యాక తుడా ను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తుడా పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు,రోడ్లు, డ్రైన్లు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తుడా కృషి చేస్తుందని చెప్పారు.
అక్రమ లేవుట్స్ వలన క్రైమ్ రేటు పెరుగుతోందనిప్రజలు అక్రమ లేఔట్స్ లో స్థలాలు కొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శులు లేవుట్,భవన నిర్మాణాల అనుమతులు వాటి అమలు, తుడా నియమ నిబంధనలు తెలుసుకొని తుడా అభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు. గ్రామపంచాయతీలు, మండలాలు,జిల్లాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని వారి హోదాకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామన్నారు.
తుడా వైస్ చైర్మన్ శుభం బన్సల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని అమలు చేయాలని కోరారు. తుడా కు అదే విధంగా పంచాయతీ కార్యదర్శుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను పూరిస్తామని చెప్పారు. తుడా భివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు.
