
"Warangal West MLA Oversees Key Development Works"
అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..
#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..
#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.