హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్…
నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి పరిధిలోగల గుంటూరుపల్లి,పిట్టలపల్లి పల్లెల మౌలిక సమస్యల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం గుంటూరు పల్లి గ్రామంలో గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి భూలక్ష్మి,మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహాల కొనుగోలు నిమిత్తం రూ.ఇరవై ఐదు వేల విరాళం అందచేశారు.గ్రామాల్లో ప్రధాన సమస్యలు తారు రోడ్డు, బస్,రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా, ప్రస్తుతం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరుపల్లికి చెందిన శ్రీను,అరవింద్, సుబ్బారావు,సుధాకర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు తౌ టం రవీందర్,దేషిని ఐలయ్య,వంశీ,మిట్టపల్లి సుభాష్,సముద్రాల కృష్ణ, రమేష్, రాజు, ఇస్తారి, రంజిత్, రంజాన్, శ్రీను, సారయ్య, భార్గవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు