మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.