# షోకాజ్ నోటీసు పట్ల ఆగ్రహం ..
# బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కౌన్సిలర్ దార్ల రమాదేవి
నర్సంపేట / నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో పార్టీకి కట్టుబడి ఉన్న మాకు
షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,
కౌన్సిలర్ దార్ల రమాదేవి బిఆర్ఎస్ పట్టణ కమిటీపై మండిపడ్డారు.ఈ సందర్భంగా దార్ల రమాదేవి
మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోవడానికి మేము మద్దతు ఇచ్చినందుకు మాపై ప్రజల విశ్వాసం కోల్పోయారని అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చామని అందుకు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్
పత్రికల్లో షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు
పత్రికా ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈనెల 2న నర్సంపేట మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొందరు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలుపకుండా అవిశ్వాస తీర్మానాన్ని నాగెల్లి వెంకటనారాయణకు తెలిసినా
కూడా అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన వారికి షోకాజ్ నోటీసు
ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.మేము పార్టీ వెంట ఉన్నందుకు మాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి? ఇందుకేనా తెలంగాణ ఉద్యమం కోసం నా ప్రాణాన్నిపణంగా పెట్టి ఉద్యమం చేసింది. ఎవరి స్వార్థం కోసం పార్టీని అబాసుపాలు చేస్తున్నారన్నారని రమాదేవి ఆరోపించారు.