భూపాలపల్లి నేటిధాత్రి
వికారాబాద్ జిల్లా, లగచర్లలో
ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి చేయడం పనికిమాలిన చర్య అని కలెక్టరేట్ పరిపాలన అధికారి ఖాజా మోహినుద్దీన్ అన్నారు.
సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా
మంగళవారం ఐడిఓసి కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్లు కానీ అధికారులు కాని ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల విధి విధానాలు, మార్గదర్శకాల మేరకు పని చేసే ఉద్యోగులు మాత్రమేమని, జనం లేరని ఎక్కడో ఉన్నారని చెప్తే వెళ్లిన కలెక్టర్ సిబ్బంది పై దాడి చేయడం చాలా చాలా దారుణమన్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు, ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చట్టం ద్వారా ప్రజల నుండి భూములను సేకరణ చేస్తుందని తెలిపారు. ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగుల సంగం అధ్యక్షుడు రామ్ మోహన్, షఫీ, రజాక్, తహసీల్దార్. మురళి, ఈడిఎం శ్రీకాంత్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంగం అధ్యక్షులు బండారి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.