Water Crisis Solved with New Borewell by BRS Leader
నీటి కష్టాలు: బీఆర్ఎస్ నాయకుడి చొరవతో కొత్త బోరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం పాత 14వ వార్డులోని బాబు మోహన్ కాలనీలో మంచినీటి సమస్యను స్థానికులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. జనాభా పెరుగుదలతో ఉన్న బోరు సరిపోకపోవడంతో, ఆయన వెంటనే స్పందించి, ఒక గంటలోనే కొత్త మంచినీటి బోరును ఏర్పాటు చేయించారు. ఈ చర్యతో కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నరేష్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
