బొమ్మకూరు డ్యాం నుండి తపస్ పల్లి డ్యాం కు నీటి విడుదల
చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల, కొమురవెల్లి,మండలంలో పలు గ్రామాల చెరువులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నాయని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న జనగామ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి నీళ్లు బొమ్మకూరు డ్యామ్ కు నీటిని విడుదల చేయాలని కోరారు నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలకు కొమురవెల్లి చేర్యాల రైతుల పక్షాన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితో అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు