https://epaper.netidhatri.com/
రైతు మద్దతే కారుకు వరం!
`తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్.
`నెర్రెలు బారిన నేలకు ఊపిరిలూదిందే బిఆర్‌ఎస్.
`తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్.
`బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్.
`తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్.
`బిఆర్‌ఎస్ కు రైతులే అండ.
`పేదలకు కేసిఆర్ నాయకత్వమే అండా దండ.
`సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్ పాలన.
`తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్.
`బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్.
`ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు.
`ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు.
`సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.
`ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.
`వాళ్ల మనసులో కూడా వుంది కారే!
`వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్ నే!
హైదరాబాద్,నేటిధాత్రి:
జలం ఈ పదం వింటేనే తెలంగాణ జనం మనసు పులకరిస్తుంది. తనువు పరవశిస్తుంది. ఎందుకంటే నీటి కోసం తెలంగాణ పడిన గోస అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు నీటి కోసం అల్లాడాయి. ఒకప్పుడు తెలంగాణ గొలుసుకట్టు చెరువులతో కళకళలాడుతూ వుండేది. ఒక్క తెలంగాణ లోనే సుమారు 60వేలకు పైగా చెరువులుండేవి. జలకళలతో కళకళలాడుతూ వుండేవి. నిజాం కాలంలో వ్యవసాయం మీద వచ్చే పన్నుతోనే అప్పటి హైదరాబాదు రాష్ట్రం సిరి సంపదలతో తులతూగుతూ వచ్చేది. ప్రపంచంలోనే నిజాం నవాబు అధిక సంపన్నుడు కావడానికి కారణం తెలంగాణలో సాగు సంపదే కారణం. నిజాం పాలన నుంచి విముక్తి జరిగి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటైంది. అలా స్వేచ్చా వాయువులు పీల్చుకున్నదో లేదో, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మళ్ళీ తెలంగాణకు కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ ప్రజల జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విలీనమై సమయంలో మిగులు రాష్ట్రం. తెలంగాణ వనరులు ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. తెలంగాణ ఆదాయం తో సీమాంధ్ర లో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లతో పాటు పోతిరెడ్డిపాడు ఇలా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులతో సీమాంధ్ర ను సస్యశ్యామలం చేసుకున్నారు. తెలంగాణ ను ఎండబెట్టారు. అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ సాగు రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు. తెలంగాణను అరవై ఏళ్లు మభ్యపెట్టి, మాయ చేసి దోచుకున్నారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ఆంధ్రా అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ ను ఎందుకు కాకుండా చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మరింత విధ్వంసానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో నీటి దోపిడే జరిగేది. తెలుగుదేశం వచ్చాక వనరులు కొల్లగొట్టి, తెలంగాణ ను పీల్చి పిప్పి చేసింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా దోచుకున్నారు. తెలంగాణ ఏ మారు మూల ప్రాంతంలో చిన్న ఉద్యోగంలో కూడా ఆంద్రా వాళ్లే…తెలంగాణ సాగు విపరీతమైన విద్వంసం చేశారు. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పక్కనపెట్టారు. తెలంగాణ ను నీళ్లిస్తే ఆంధ్రాకు కష్టమవుతుందని ప్రాజెక్టులు పూర్తి పూర్తి చేయలేదు. పైగా నికర జలాలు ఆంద్రాకు తరలించి, వరద జలాలు తెలంగాణ కు అని చెప్పి మోసం చేశారు. అవి కూడా ఇవ్వకుండా తెలంగాణను ఆగం చేశారు. ఒక దశలో తెలంగాణ ప్రాజెక్టుల ఊసెత్తొద్దని కూడా చంద్రబాబు హుకూం జారీ చేశారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల ప్రభుత్వం వల్ల కాదన్నారు. తెలంగాణ ఊర్లన్ని వలసలు పోతున్నా చూస్తూ ఊరుకున్నారు. సీమాంధ్రులు హైదరాబాదు పరిసర ప్రాంతాల చెరువులన్నీ మాయం చేశారు. తెలంగాణ చెరువుల ఆనవాలు లేకుండా ధ్వంస రచన సాగించారు. ప్రాజెక్టులు కట్టకపోయినా, కనీసం చెరువుల బాగు చేయడానికి కూడా చేతులు రాలేదు. తెలంగాణ ను ఎడారి చేశారు.
అలాంటి తెలంగాణ లో ఇప్పుడు జలమే జలం…ఎక్కడ చూసినా జలమే…ఏ దిక్కు చూసినా పొలమే…పచ్చదనమే…
మరి సరిగ్గా పదేళ్ల క్రితం ఎక్కడ చూసినా ఎండిన బీడులే. ఒట్టిపోయిన వాగులే…ఆనవాలు కోల్పోయిన వాగులే…జల జాడ లేకుండా పోయింది. భూ గర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన స్థితి. కరువు రక్కసి చేతిలో విలవిలలాడిపోయింది. పనికి ఆహార పథకం పనిలో ఏ పూట బియ్యం ఆ పూట తెచ్చుకొని కూలి చేసుకునేంతగా దిగజార్చారు. అలా తెలంగాణను ఏడిపించారు. ఆ వేధన నుంచి, ఆ నిర్వేదం నుంచి, ఆ ఆక్రోశం నుండి వచ్చిందే తెలంగాణ ఉద్యమం…. కేసిఆర్ రూపంలో ప్రపంచ ఉద్యమాల చరిత్రకే ఒక గొప్ప పాఠం. అలాంటి నేత చేతిలో తెలంగాణ బంగారమైంది. ప్రాజెక్టులు సాధ్యమే కాదన్న చోట కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా కాళేశ్వరం పూర్తి చేసి, ఎండిన తెలంగాణ ను సస్యశ్యామలం చేశారు. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేశారు. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు.. రంగారెడ్డి, మల్లన్న సాగర్ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. అంతకు ముందే తెలంగాణ ను జలపాతం చేశారు. కాలువలు తీసి చెరువుల నింపారు. చెరువుల్లో పూడిక తీసి, జలాలు నింపి పూర్వ వైభవాన్ని తెచ్చారు. అసలు ఆనవాలు లేని చెరువులకు కూడా కొత్త కళ తెచ్చారు. జలజీవం పోశారు. తెలంగాణను జీవధార చేశారు. అందుకే తెలంగాణ జలమే బిఆర్‌ఎస్ బలం!
రైతు మద్దతే కారుకు వరం! అని వేనోళ్ల కొనియాడబడుతోంది.
తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్. నెర్రెలు బారిన నేలకు ఊరిపిలూదిందే బిఆర్‌ఎస్. తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్. బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్. తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్.బిఆర్‌ఎస్ కు రైతులే అండ.పేదలకు కేసిఆర్ నాయకత్వమే అండా దండ. సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్ పాలన.తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్. బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్.
అలాంటి తెలంగాణ లో ప్రతిపక్షాలా? సమస్యే లేదు.
ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు. ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు. ఎందుకంటే తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. ప్రతీ కుటుంబానికి అందుతున్నాయి. పైగా గొప్ప పథకాలు కూడా తెలంగాణ లోనే అమలులో వున్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వెనక గొప్ప సామాజిక సృహ దాగి వున్నది. ఒకప్పుడు తెలంగాణ లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరిగేవి. ఎప్పడైతే కళ్యాణ లక్ష్మీ అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ లో బాల్య వివాహాలు లేకుండా పోయాయి. దళిత సమాజం మీద ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు మొసలి కన్నీరు కార్చినవే. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో నుంచి ఆవిషృతమైన దళితబంధు ఆ కుటుంబాలలో వెలుగులు నింపుతోంది. ఆర్థిక స్వావలంబన లో దళితులను భాగస్వామ్యం చేస్తే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయి. ఇప్పుడు తెలంగాణ లో అదే జరుగుతోంది. తెలంగాణ సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.వాళ్ల మనసులో కూడా వుంది కారే!
వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్ నే! ఇది సత్యం.. నిత్యం.. తెలంగాణ ప్రగతికి సోపానం.