నా చెరువు నాడు…నేడు!

https://epaper.netidhatri.com/

`గణేష్‌ నిమజ్జనాలకు కూడా నీళ్లుండేవి­ కాదు!

`గణేష్‌ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది.

`తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు.

`కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది.

`సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు.

` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు.

`ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం.

`పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే.

`ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి.

`ఇప్పుడు ప్రతి పల్లె ఒక నీటి గంగాళం.

`ప్రతి చెరువులో నిరంతరం జలం.

`కుల వృత్తులకు ఆదాయ మార్గం.

`పొలాల గొంతు తడుపుతున్న గంగమ్మ ప్రతిరూపం.`

పాడిపంటలందిస్తున్న అష్టలక్ష్మి వైభవం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కళ తప్పిన నా తెలంగాణ చెరువుకు మళ్లీ జీవమొచ్చింది. చెదిరిన చెరువుకు జలజీవమొచ్చింది. చెరువు బాగైంది. అందమైన నీటి బాంఢగారమైంది. మా చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. అంతకన్నా సుందరంగా ముస్తాబైంది. జలమంత చెవరుకు జగమంత పండగొచ్చింది. ఊరంతా మురిసింది. ఊరే మెరిసింది. సంబరాలు చేసుకున్నది. కూలి పోయిన కులవృత్తులకు మళ్లీ తెలంగాణ పల్లె ఆలవాలమైంది. చెరువే తెలంగాణ పల్లెకు ఆదెరువు. అది ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిపోయింది. చిద్రమైపోయింది. పల్లె బతుకు ఆగమైంది. కులవృత్తులు అంతరించిపోయాయి. మత్స సంపద కానరాకుండాపోయింది. దాని మీద ఆధారపడే మురిరాజ్‌లు నారాజైండ్రు. కొత్త ఉపాధి బాటనెంచుకున్నారు. ఊరు వదిలి పట్టణాలు వలస వెళ్లిండ్రు. బొంబాయి లాంటి ప్రాంతాలలో కూలి పనులు చేసుకున్నారు. తెలంగాణలో మత్స సొసైటీలన్నవి కనుమరుయ్యాయి. చెరువే లేక ముదిరాజ్‌ల జీవనమే ఆగమైంది. ఇలా చెరువు ఎండిపోయి సాగు లేకుండాపోయింది. చెరువులో నీరు లేక పశు సంపద మృగ్యమైంది. మొత్తంగా పల్లెకు గ్రహణం పట్టినంత పనైంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పల్లెకు మళ్లీ సొగసొచ్చింది. చెరువుకు సోయగమొచ్చింది. తెలంగాణ రాగానే చెరువుకు నీరొచ్చింది. వానా కాలం కాకపోయినా చెరువు నిండిరది. ఏళ్ల తరబడి గొంతెండి పోయిన చెరువు దాహంతీరేదాకా నిండిరది. చెరువు నింపడంతో ఊరంతా పచ్చబడిరది. భూగర్భమంతా నీరు సందడి చేస్తోంది. పల్లెకు పండగొచ్చింది. మళ్లీ సాగు చిగురించింది. ఎండిన బీడులు పొలాలయ్యాయి. గుంట కూడా వదిలిపెట్టకుండా పంట పండుతోంది. ఊరిని సుసంపన్నం చేస్తోంది. చెరువు కుల వృత్తులకు ఆధారమైంది. ఆదాయం సమకూర్చుతోంది. పల్లె జీవితాలను నిలబెట్టింది. ఇదీ తెలంగాణ చెరువుల ఘనత. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణకు అందించిన కలల పంట.
ఒకనాడు నా చెరువులో నీటి చుక్క లేక కొన్ని దశాబ్దాలు ఎండిపోయింది. కాదు..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒట్టిపోయింది.
వర్షాకాలంలో కూడా చెరువులోకి నీరు రాకుండాపోయింది. ఓ వైపు కరువు. మరో వైపు పాలకుల దుర్మార్గం. ప్రకృతి పగబట్టినట్లే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను చినుకు ముద్దాకుండా శాపానికి గురైంది. ఉమ్మడి పాలకుల కోపానికి గురైంది. దాంతో తెలంగాణ చెరువు పూర్తిగా ఎండిపోయింది. తన ఆనవాలు తానేమర్చిపోయింది. ఒక దశలో గణేష్‌ నిమజ్జన సమయంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా చుక్క నీరు లేక తెలంగాణ గోసపడిరది. అయ్యో గణనాధా? అంటూ బోరున విలపించింది. భక్తిభావంతో నిలుపుకొని కొలిచిన దేవుడిని నీరు లేని చెరువులో నిమజ్జనం చేయలేక, కొన్ని సార్లు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. ఇక తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ ఏ చెరువులో నీరుందో తెలుసుకొని ఎంత దూరమైనా వెళ్లి నిమజ్జనం చేసిన ఘటనలున్నాయి. ఇదీ ఆనాడు తెలంగాణ దీనస్దితి. ఇక తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే ఆది వాసి సమ్మక్క సారక్క జాతర. రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. తలాపున గోదారి పరుగులుపెడుతుంది. కాని సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో జంపన్న వాగు ఎప్పుడూ ఎండిపోయి వుండేది. జాతర సమయంలో జంపన్న వాగులోకి గోదావరి నదీ జలాలు వదిలేవారు. ఆసియాలోనే అత్యంత గొప్ప జాతరగా గుర్తింపు వున్న మేడారం జాతరలో నీటి కట కట అలా వుండేది. కనీసం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా నీరు సమృద్దిగా వుండేది కాదు. మరి ఇప్పుడు నిరంతరం జంపన్న వాగు జీవ నదిలా పారుతోంది. మేడారం వచ్చిన భక్తుల పాపాలను కడిగేస్తూ నిరంతరం సాగిపోతోంది. ఇదీ నా తెలంగాణ. ఇక పుష్కరాల సమయం అంటే చాలు ఆంధ్రాకు పండగ. తెలంగాణలో కూడా కృష్ణా, గోదారి నదులు పారుతున్నా వాటిలో స్నానం చేసేందుకు కూడా ఉమ్మడి పాలకులు అవకాశం కల్పించేవారు కాదు. అసలు తెలంగాణలో పారుతూవున్న గోదారి నీళ్లకన్నా, రాజమండ్రి వెళ్తేనే పుణ్యం అన్నంతగా ప్రచారం చేసేవారు. కృష్ణా నది పుష్కరాల సమయంలో విజయవాడలో స్నానం చేస్తేనే పుణ్య స్నానం పూర్తయినట్లు చెప్పేవారు. దాంతో తెలంగాణలో ఆ నదులున్నా, ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. నీటి గోసకు, నిర్లక్ష్యానికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశారు. తెలంగాణ ప్రజలు ఆగమౌతుంటే నవ్వుకున్నారు.
నా తెలంగాణ పచ్చబడాలి. పల్లె కళకళలాడాలి. పచ్చ దనం వెల్లివిరియాలి.
పాడి పంట సమృద్ధిగా మారాలి. పల్లెలో కరువును తరిమివేయాలి. పల్లెకు మళ్లీ వెలుగు రావాలి. ఊరంతా పండగ కావాలి. అంటే ముందు చెరువు బాగు పడాలి. చెరువుకు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పించారు. తెలంగాణలో వున్న నలభై ఆరు వేల చెరువులను మూడేళ్లలలో దశల వారిగా బాగు చేశారు. ముందు కరువు రక్కసితో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించారు. తొలి విడతలో ఆ చెరువుల బాగుకు ప్రణాళికలు తయారు చేశారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే చెరువుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. ముందు చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలు బాగు చేశారు. వాటిపై తాటి, ఈత చెట్లు పెంచారు. 2015లోనే చెరువులు గోదావరి నీళ్లతో నింపడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ వాతావరణం మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీటిని చూడని చెరువులు ఎండకాలంలో మత్తళ్లు పోశాయి. వాగులు వంకలు వానలు లేకున్నా పారాయి. మత్తళ్లు దుంకుతూ పారిన జలాలు గొలుసు కట్టు చెరువుల బాటన ఒక చెరువు నుంచి మరో చెరువు చేరాయి. ఇలా తెలంగాణలో చెరువులన్నీ నిండాయి. ఊళ్లన్నీ పచ్చబడ్డాయి. ఎండిపోయిన బావుల్లో ఊటలు మొదలయ్యాయి. వానాకాలంలో ఎల్లబోసే బావులు ఎండాకాలంలో కూడా ఎల్లబోశాయి. ఎండిన బోర్ల నీళ్లతో నిండాయి. ఇంతలో నిరంతర ఉచిత కరంటు వచ్చింది. రైతులకు వరమైంది. పాడి పంటల పండుగలు మళ్లీ మొదయ్యాయి. ఇలా చెరువులు నీటి గంగాళాలై నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఆనవాలు వుందా? అన్న అనుమానం వున్న చోట చెరువు లోతుగా వుంది. అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ చెరువులు నిండి మత్స సంపదకు ఆలవాలమైంది. పొలాలు తడిపే గంగమ్మతల్లి ప్రతిరూపమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాడిపంటల సంపదనందిస్తూ, అష్టలక్ష్మి వైభవం పల్లె చూస్తోంది. ఇదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. అపర భగీరధుడు కలలు గన్న తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఈ తరానికి చెరువును చూపించడమే కాదు, పాడి పంటలను అందించే వరంగా తీర్చిదిద్దారు. మలి తరానికి బంగారు బాటలు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *