గాంధీజీ స్కూల్ కు వాటర్ కన్జర్వేషన్ స్టేట్ లెవెల్ అవార్డు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
నల్లగొండ జిల్లా చండూర్ లోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు జలమండలి సూచనల మేరకు, జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపుమేరకు చండూర్ గాంధీజీ స్కూల్ అపూర్వ స్పందనతో స్పందించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు జల సంరక్షణ పై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి, జల సంరక్షణ పట్ల వారిలో ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మార్చి 22న సామూహికంగా జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకుగాను జలమండలి, మమత ఎడ్యుకేషనల్ సొసైటీ, సేవ్ ఎర్త్ ఫౌండేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సమన్వయంతో జల ప్రతిజ్ఞను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నందుకు మార్గదర్శకంగా జల సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలలో భాగస్వాములైన గాంధీజీ స్కూల్ చండూరు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ, వాటర్ కన్జర్వేషన్ -2024 అవార్డును గాంధీ సంస్థల వైస్ చైర్మన్, మమత ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ టి. సురేందర్ లు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ సరికొండ వెంకన్న, ఎ ఎస్ ఎన్ మూర్తి లకు అవార్డు ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటిలో కనీసం మూడు మొక్కలు, ఒక ఇంకుడు గుంతను తప్పక నిర్మించుకొని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి అన్నారు. భూగర్భ జలాల పెంపు కోసం కృషి చేస్తేనే భవిష్యత్తు తరాలకు నీటిని అందివ్వటం సాధ్యపడుతుందన్నారు. నీటి కొరత ఏర్పడకుండా ఉండాలంటే నీటి వృధాను ప్రతి ఒక్కరూ అరికట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం కోసం సాంకేతిక సలహాలు, సూచనల కోసం జలమండలి భూగర్భజల విభాగం సహాయ సంచాలకులు జాల సత్యనారాయణ ను 998 998 5102 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు. లేదా స్వచ్ఛంద సంస్థ ల ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మమత ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ యానాల రాధిక, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సీఈఓ చైతన్య రెడ్డి, పి. సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!