పాఠశాలలో తడి చెత్త ,పొడి చెత్తకు ట్యాంకులు ఏర్పాటు
సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో తడి, చెత్త పొడి చెత్త కు సంబంధించిన ట్యాంకు ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూరియా కొడతా లేకుండా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మమత, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
