
వృధాగా పోతున్న నారింజ నీళ్లను అరికట్టాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం నారింజ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ వర్షాకాలం వచ్చింది మొదటి వర్షానికే నారింజ పూర్తిగా నిండిపోయింది నీరంతా కర్ణాటకకు వెళ్లిపోతున్నాది అంటే వచ్చే వర్షాకాలం నీరంతా కూడా వృధాగా కర్ణాటకకు పోతున్నదన్న మాట.ఈ బ్యారేజ్ కు 3000 ఎకరాల ఆయకట్టు స్థిరికరించ బడియున్నది కానీ ఉపయోగంలోకి ఎప్పుడు రాలేదు గతంలో కాలువలు మరమ్మతుల కొరకు నిధులొచ్చాయని అన్నారు టెండర్ అయిందన్నారు పనులు ప్రారంభిస్తామన్నారు కానీ ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది దానికున్న గేట్లను చూస్తే భయం అనిపిస్తున్నది ఈ వచ్చిన నీటి ప్రవాహానికి ఆతర్వాత గేట్లపై నుండి నీళ్ళు బోర్లీ పోవడం వల్ల గేట్లు నిరుపయోగం అయ్యాయి ఒక బ్యారేజ్ లో ఎక్కువ నీరు అనేది గేట్ల కింద నుండి పోవాలి కానీ ఇక్కడ పైనుండి పోతున్నాయి గేట్లన్ని పాడైపోయాయి,ఆగేట్ల మందం కూడా తగ్గినట్లు అనిపిస్తున్నది ఎప్పుడైనా ఏమైనా కావచ్చు దీనిపైన అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది.బ్యారేజీ పైన ఉన్న దారి రెండు రాష్ట్రాలను కలిపే దారి ఆధారి కూడా చాలా చిన్నగా అయింది ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
ఈ ప్రాజెక్టు వలన చుట్టు ప్రక్కల సుమారు 14 గ్రామాలలో భూగర్భ నీటి మట్టం పెరిగే అవకాశాలున్నాయి.నారింజ ఇక్కడి ప్రాంతంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు నారింజలో చుట్టు ప్రక్కల గల పారిశ్రామిక కలుషిత కర్మాగారల ముఖ్యంగా అల్లనా కాలుష్య జలాలను ఇందులో కలుపుతున్నారు అధికారులకు ఎంత విన్నవించినా కూడా ఎలాంటి చర్యలు కనబడుత లేవు అధికారులు తెలుసుకోవాలి తాము ప్రజల కొరకు పనిచేయాలి అని కానీ ఈ కలుషిత కర్మాగారాల లంచాల కొరకు కాదని. ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు,అధికారులు మేల్కొని వృధాగా పోతున్న నీటిని,బ్యారేజ్ గేట్లను మరమ్మతులు చేసి కలుషిత నీటిని నీటిని నారింజలో కలవనివ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్,శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,శికారి శ్రీనివాస్, యం.జైపాల్,విరేశం,తదితరులు ఉన్నారు.