అర్హులైనఅందరికి పథకాలు అందేలా చూస్తాం
మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనితరామకృష్ణ
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మొదటి రోజు ప్రజా పాలన ప్రభుత్వ పథకాల 5,6,7,8,18,19,20వార్డుల సభలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంతోనే సాధ్యమని,పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూస్తామని ఇది నిరంతర ప్రక్రియని రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని వీరికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రజా పాలన ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ సుష్మ,కౌన్సిలర్స్ దామెర మొగిలి,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,గొర్రె స్రవంతి, ఏకు రాజు,పంచగిరి జయమ్మ,మున్సిపల్ కోఆప్షన్ మెంబర్స్ ఎండీ.షబ్బీర్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్,ఎంమ్మార్వో వెంకట భాస్కర్,RI దామోదర్, అగ్రికల్చర్ ఏఇవో శైలజ, మున్సిపల్ ఆర్వో రఘు, మున్సిపల్ ఆర్ఐ రవి,మెప్మా టిఎంసీటి సతీష్,హెల్త్ డిపార్ట్మెంట్,ఆర్పిలు,వార్డ్ ఆఫీసర్ లు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.