రాష్ట్ర మండల కో ఆప్షన్ ఫోరం అధ్యక్షులు రాజ్ మహమ్మద్.
చిట్యాల, నేటిధాత్రి :
వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య కి టికెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మండల కో ఆప్షన్ ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి ని కోరారు,వారు మాట్లాడుతూ 2004 నుండి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతోపోలీసు ఉన్నత అధికారిగాఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చిన దోమ్మటి సాంబయ్య గెలుపు ఓటమితో సంబంధం లేకుండా అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు సుపరిచితుడుగా కబడ్డీ క్రీడాకారుడిగా కాకతీయ యూనివర్సిటీ తరపున జాతీయస్థాయిలో ఛాంపియన్షిప్ సాధించిన ఆటగాడిగా మరియు వరంగల్ పార్లమెంటు లోని ఏడు నియోజకవర్గాలలో నీ శాసనసభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న కాంగ్రెస్ నాయకుడిగా ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గశాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తో ఉన్న సంబంధాలతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఈ ప్రాంతంలో నుండి ఎక్కువ మెజారిటీతో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా మైనారిటీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 4% పర్సెంటేజ్ రిజర్వేషన్ తో పాటుగా ఎన్నో సంక్షేమ పథకాలను అందించినది కావున మైనార్టీ ప్రజలఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దొమ్మాటి సాంబయ్యకి వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ టికెట్ కేటాయించలని ఒక ప్రకటనలో కోరారు.