పరకాల కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు ఒంటేరు రాజమౌళి
పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకుడు దొమ్మటి సాంబయ్యకే టికెట్ కేటాయిం చాలని అడ్వాకేట్ జాక్ చైర్మన్ ఒంటేరు రాజమౌళి అన్నారు.ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గెలుపుకోసం తాను కదులుతూ కదిలిస్తూ జనం కోసం తపించే తత్వం దొమ్మటి సాంబయ్య దని అన్నారు.పోలీస్ ఉన్నతాధికారిగా పని చేసిన ఆయన జనానికి సేవ చేయాలనే సదుద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారని గెలుపు ఓటమిలను లెక్కచేయని అసలైన ప్రజా నాయకుడు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉన్నడని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి గతంలో బిఆర్ఎస్ పార్టీ నిత్యం కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతి సందర్భంలో ఇబ్బందులు పెడుతుంటే నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చి వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటున్నాడని ఉద్యోగమును వదిలి ప్రజా సేవ చేసేందుకు వచ్చి ఎంతో కాలంగా జిల్లాలో పలు మండలాల స్థాయిలో పరిచయస్తుడిగా ఉంటూ అందరి మన్ననలు పొందు తున్నారని ఉమ్మడి జిల్లాలో అందరికీ సుపరిచి తులైన అందరి మన్ననలు పొందిన దళిత నేత సాంబయ్యకు ఎంపీ టికెట్ అవకాశవిస్తే ప్రజలే గెలుపు పగ్గాలను అందిస్తారని రాజమౌళి అన్నారు.