వరంగల్ లోక్ సభ ఎంపీ టికెట్ దొమ్మటి సాంబయ్యకే ఇవ్వాలి

4వ వార్డు అధ్యక్షుడు బొచ్చు కుమార్

పరకాల నేటిధాత్రి
వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ అభ్యర్థి స్థానాన్ని దొమ్మటి సాంబయ్యకు ఇవ్వాలని పరకాల పట్టణ 4వ వార్డు అధ్యక్షుడు బొచ్చు కుమార్ కోరారు.మహాభూబాబాద్ కు బలరాం నాయక్ ను ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో వరంగల్‌ అభ్యర్థిత్వంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.వరంగల్ ఎంపీ గెలుపు అవకాశాలపై ధీమా ఉన్న నాయకుడు దొమ్మటి సాంబయ్య భారీ మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్‌ నాయకుల్లో ప్రతి ఒక్కరం కష్టపడి గెలిపించుకుంటామని ప్రజల్లో చర్చ మొదలైందని అన్నారు.ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తూ రావడం,గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి పేరు సాంబయ్య అని సాంబయ్య కే టికెట్ కేటాయించాలని కుమార్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *