
బాక్సింగ్ కోచ్ శ్యాంసన్ ఆధ్వర్యంలో శిక్షణ
తనుశ్రీకి మరియు కోచ్ శ్యాంసన్ కి ఘనంగా సన్మానం
కోచ్ శ్యాంసన్ శిక్షణలో ఆర్మీ , పోలీస్ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు
హన్మకొండ, నేటిధాత్రి:
యూపీలోని నోయిడాలో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలలో హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన శీలం తనుశ్రీ కాంస్య పథకాన్ని సాధించింది 64- 67 కేజీల విభాగంలో ఢిల్లీ క్రీడాకారులతో తలపడి తనుశ్రీ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ ను సొంతం చేసుకుంది. హసన్ పర్తి మండలం కోమటిపల్లి గ్రామాని కి చెందిన సందెల శ్యాం సన్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ ముందంజలో నిలిచింది. తనుశ్రీ మరియు కోచ్ శ్యాం సన్ లను క్రీడాభిమానులు మరియు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
తదుపరి తనుశ్రీకి మరియు కోచ్ శ్యాం సన్ కి ఘనంగా సన్మానం చేశారు.
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించిన శీలం తనుశ్రీని మరియు కోచ్ శ్యాంసన్ లని హసన్పర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ సన్మానించారు. తనుశ్రీ తల్లిదండ్రులు మాట్లాడుతూ కోచ్ శ్యాంసన్ తన శిక్షణలో చాలామంది విద్యార్థులకు ఆర్మీ మరియు పోలీస్ ఉద్యోగాలు వచ్చాయని రానున్న రోజులలో చాలామంది విద్యార్థుల బతుకులు బాగుపడతాయని అన్నారు.తొలుత ఎర్రగట్టు క్రాస్ నుంచి హసన్పర్తి వరకు ర్యాలీ నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, మండల అధ్యక్షుడు బండి రజనీ కుమార్, చంద్రమోహన్, సురేందర్ గౌడ్ సురేందర్ రెడ్డి, బాక్సింగ్ ఉమ్మడి జిల్లా సెక్రెటరీ నరసింహ రాములు, పార్థసారథి, చకిలం రాజేశ్వరరావు మరియు బాక్సర్ మధు బండారి పాల్గొన్నారు.