నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా పరిధిలోని షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థుల కోసం 2024 -2025 విద్యా సంవత్సరం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా అర్హులైన 1,3,5, తరగతి విద్యార్థుల కోసం లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, జారీ చేసినప్పటికీ, వరంగల్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అధికారి (డిఎస్సిడిఓ) ఇప్పటివరకు పత్రిక ప్రకటన జారీ చేయకపోవడం దళిత విద్యార్థుల పట్ల వివక్షత చూసినట్లేనని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు.
హన్మకొండ జిల్లా, జనగామ ములుగు మహబూబాబాద్ ఇతర జిల్లా అధికారులు సంబంధిత విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు తయారు చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రతీక ప్రకటన ఇవ్వడం జరిగిందన్నారు. కానీ వరంగల్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అధికారి నేటి వరకు కూడా పత్రిక ప్రకటన ఇవ్వకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని కోరారు.దళిత విద్యార్థుల పట్ల వివక్షత చూపిన వరంగల్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేని పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రసాద్, రఘు, శ్రీధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.