https://epaper.netidhatri.com/
జనగామ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు…ఆయన మాటల్లోనే.
`జనగామలో వార్ వన్ సైడే.
`పల్లాకు పెరుగుతున్న మద్దతు.
` కుల సంఘాల తీర్మానాలు
` అడుగడుగునా పల్లా కు ఆదరణ.
` పెద్ద ఎత్తున పల్లా కు అనుకూలంగా తీర్మానాలు.
`గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం.
`నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం.
`ప్రచారంలో కనిపించని కొమ్మూరి.
`కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రం.
`బిఆర్‌ఎస్ శ్రేణుల విసృత ప్రచారం.
బిఆర్‌ఎస్ పటిష్టంగా వున్న నియోజకవర్గాలలో జనగామ ఒకటి. ఇక్కడ ఉద్యమ నేపధ్యం వున్న పార్టీలకు కొంత ఆదరణ ఎక్కువ. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి జనగామలో బిఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్ధాయిలో మద్దతు తెలిపిన ప్రాంతాలలో జనగామ ముందు వరుసలోవుంటుంది. ఇప్పుడే కాదు జనగామ అంటేనే పోరాటాల ఖిల్లా. అందుకు ఇక్కడ పోరాట వీరులకు ఆదరణ ఎక్కువ. తెలంగాణ కోసం పోరాటం చేసిన బిఆర్‌ఎస్‌కు జనగామలో మరింత ఆదరణ. అలాగే ఆసారి ఎన్నికల్లో కూడా అదే పరంపర కొనసాగనున్నది. గత కొంత కాలంగా జనగామాలో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలున్నాయంటూ కొన్ని పార్టీలు, సంస్ధలు పనిగట్టుకొని ప్రచారం సాగించాయి. కాని బిఆర్‌ఎస్‌కు తప్ప, జనగామలో మరోపార్టీకి బలం లేదు. పట్టులేదు. ప్రజల ఆదరణ లేదని తేలిపోతోంది. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. ఇది కూడా ప్రజల్లో కాంగ్రెస్ అంటే చులకన భావమేకాదు, హేహ్య భావం కూడా కలిగేలా చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అసలు రాజకీయం తెలసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకుంటే ప్రతాప్ రెడ్డి రాజకీయాల్లో వుండాలనుకుంటాడు. కాని ప్రజలకు దూరంగా వుంటుంటాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహంతో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యాడు. కాని ఆయన ఏనాడు ప్రజల్లో లేరు. జనంతో కలిసిపోలేదు. ఉద్యమంలో కూడా ఆయన కనిపించడం అంటే వేదికల మీద తప్ప రోడ్ల మీద కొట్లాడిరది లేదు. పైగా ఆయన చేర్యాల పట్టణంలో కూడా కారు అద్దాలు ( అప్పుడు కార్లకు నల్లటి ఫిల్ములు వుండేవి) పైకెక్చించుకొనే వుండేవారు. ప్రజలకు అభివాదం చేయడం ఆయనకు ఇష్టం వుండదు. కనీసం పట్టణంలో తిరుగుతున్నప్పుడైనా ప్రజలతో కలివిడిగా వుండేవారు కాదు అన్న ఆరోపణలున్నాయి. ప్రజలు నమస్కారం అంటే కూడా కనీసం ప్రతిగా మర్యాదను కూడా చూపించేవారు కాదని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి దళితులంటే చిన్న చూపు అని గతం నుంచి చెప్పుకుంటారు. ఆయన గతంలో ప్రచారానికి వెళ్లినా, ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల మీద గ్రామలకు వెళ్లినా ఉన్నత వర్గాల కుటుంబాలలోనే మంచి నీరు తాగేవారు. వాళ్ల ఇళ్లలోనే కాసేపు సేద తీరేవారు. ఏనాడు ఆయన కనీసం బిసి నాయకులు ఇండ్లలో మంచినీళ్లు తాగ లేదని అంటుంటారు. అంతే కాదు ప్రచారం సమయాల్లో కూడా ఏనాడు ఆయన దళిత నాయకులను వెంట తీసుకెళ్లలేదని అంటుంటారు. దళిత వాడల్లో ప్రచారాలు కూడా చేయలేదని చేర్యాల మండలంలో చెబుతుంటారు. అదే ఇప్పుడు ఆయన కుమారుడు కూడ అనుసరిస్తున్నాడని అంటున్నారు. తాజాగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు చేర్యాల మండలంపరిధిలోని ఓ గ్రామ మాజీ దళిత సర్పంచ్‌ను బూతులు తిట్టడమే కాకుండా చేయి, చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ సర్పంచ్‌కు మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని దళితులంతా కొమ్మూరికి వ్యతిరేకంగా మారారని, గ్రామాలలో తీర్మాణాలు చేసినట్లు కూడా సమాచారం. దాంతో కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో మిగిలిన కొద్దిపాటి ఆదరణ కూడా లేకుండాపోయిందని కాంగ్రెస్ శ్రేణులో మధపడుతున్నాయి. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజల్లో కలుస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తీరికలేకుండా ఆయన గ్రామాలను చుట్టేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా విసృతంగా ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుపై పూర్తి ధీమాతో వున్న బిఆర్‌ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు తనదే అంటున్నారు. ప్రజాశీర్వాదం తనకే అంటున్నారు. ప్రచారంలో ప్రజలు ఇస్తున్న ధైర్యం చూస్తుంటే మంచి మెజార్టీ తో గెలుస్తానన్న ధీమా మరింత బలపడుతోందంటున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…
జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంతో విజ్ఞులు.
ఎంతో చైతన్య వంతులు. ఎవరు ఎలాంటి వారు అన్నదానిపై పూర్తి అవగాహన, స్పష్టత వున్న వాళ్లు. ముఖ్యమంత్రి కేసిర్ అంటే ఎనలేని అభిమానం వుంది. ఏ ఊరికి వెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా కేసిఆర్ నాయకత్వమే కావాలని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రజల అభిమానం , ఆదరణ ప్రత్యక్షంగా చూస్తున్నాను. గతంలో పట్టభద్రుల ఎన్నికలు చూశాను. అప్పుడు గెలిపించారు..అయితే ఆ ఎన్నికలు వేరు… అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఎమ్మెల్యే ఎన్నికలు అంటేనే ఓ అద్భుతమైన భావన నాకు కలిగింది. ప్రజలకు దగ్గరగా వుండే జీవితం అంటే ఎంత గొప్పగా వుంటుందో, ప్రజల మధ్య జీవితం ఎంత గౌరవంగా వుంటుందో తెలిసింది. ప్రజలకు సేవ చేయడం అన్నది పూర్వ జన్మ సుకృతం. ప్రజలతో కలిసి సాగడం అన్నది గొప్ప అనుభవం. ప్రజల ఆదరణ చూస్తే ఒక్కొసారి తెలియకుండానే నా కళ్లలో ఆనందబాష్పాలు సడులు తిరుగుతున్నాయి. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను. వారి ఆదరణ చూస్తుంటే జీవితాంతం వారికి ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తోంది. నా జీవితాంతం జనగామ ప్రజలకు సేవ చేస్తాను. వారి సేవలోనే తరిస్తాను. జనగామను అన్ని రంగాలలో అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను. గ్రామాలను మరింత తీర్చిదిద్దుతాను. జనగామ నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇప్పటీకీ వేలాది మంది హైదరాబాద్ కు ఉపాది అవకాశాల కోసం వెళ్తుంటారు. వారికి జనగామలోనే ఉపాది అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను. జనగామకు కూడా ఐటిని తీసుకొస్తాను. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో వున్న జనగామ గొప్ప విద్యాకేంద్రం. ప్రభుత్వం ఎలాగూ ఉద్యోగ కల్పన చేపడుతూనే వుంటుంది. దానికి తోడు నిరుద్యోగ యువతలో వారి వారి స్కిల్ ను బట్టి కూడా ఉపాది కల్పన జరగాల్సిన అవసరం వుంది. అందుకోసం ఐటి కంపనీలు, ఫార్మా కంపనీలు, ఇతర ఇండస్ట్రీలు కూడా తెచ్చి, జనగామను ఉపాధికి కేంద్రంగా చేస్తాను. స్ధానిక యువత జీవితాల్లో వెలుగులు నింపుతాను. ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందించే వారధిగా వుంటాను.
ప్రతిపక్షాలకు జనగాంలో చేటు లేదు.
ఎందుకంటే జనగామ చాల వరకు ఎంతో ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్ జనగామకు అ వసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. జనగామ జిల్లాకోసం జరిగిన ఉద్యమాన్ని గౌరవించి జిల్లా ఏర్పాటు చేశారు. జనగామ చెరువులను మొదటి దఫాలోనే పునరుద్దరణ చేసి, ఒకనాడు చుక్క నీటికి కటకటలాడిన జనగామను సస్యశ్యామలం చేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జనగామ ప్రాంతం మీద ఆధారపడి చుట్టూ కొన్ని వందల గ్రామాలు అధారపడి వుంటాయి. నిత్యం ఏ చిన్న అవసరం వున్నా, ప్రజలు జనగామకు వస్తుంటారు. అలాంటి జనగామను మరింత అభివృద్దిచేయాల్సిన అవసరం వుంది. నేను గెలిచిన మరుక్షణం నుంచి జనగామ అభివృద్దికోసం నిరంతర శ్రమిస్తాను. ఈనెల 18న చేర్యాలలో కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజాశీర్వాద సభ వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు చేర్యాల ప్రాంతంతో ఎంతో అనుబంధం వుంది. చేర్యాల సిద్దిపేట జిల్లాలో బాగంగా వుంది. అక్కడి ప్రజలు చేర్యాల రెవిన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు. చేర్యాల ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ప్రతి దానిని నెరవేరుస్తాను. వారి కళ్లలో ఆనందం నింపుతాను. చేర్యాలలో ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. నా జీవితాంతం వారికి సేవ చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తాను.