· బీఆరఎస్ ప్రణాళిక నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణకే పరిమితం
· ప్రపంచ స్థాయి రివర్‌బెడ్‌గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రణాళిక
· ఈ కారణంగానే ప్రాజెక్టు ఖర్చు పెరిగింది: ప్రభుత్వం
· కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం బఫర్‌జోన్ 50 మీటర్లు తప్పనిసరి
· వరదలనుంచి రక్షణకు ఇది అవసరం
· ఆ పరిధిలో వున్న ఇళ్లను తొలగించాల్సి వచ్చినా తప్పదు
· స్పష్టం చేస్తున్న నిబంధనలు
· పునరావాస ప్యాకేజీతో ప్రభుత్వం ముందుకు
· బాధితులతో చర్చించకుండా ముందుకెళ్లడమేంటన్నది విమర్శకుల వాదన
· 10 నుంచి 15వేల ఇళ్లకు తొలగింపు గండం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు మొత్తం వివాదాల్లో చిక్కుకుంది.ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదని ఆరోపించడమే కాదు “మూసీ దండి మార్చ” వంటి ర్యాలీలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును కేవలం రూ.16800 కోట్లతో పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రచించామని, పేదల ఇళ్లను కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా మొత్తం మూసీనది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆరఎస్ ఆరోపిస్తోంది. మూసీ సుందరీకరణకు పేదల ఇళ్లు కూలగొట్టాల్సిన అవసరం లేదన్నది హరీష్‌రావు, కేటీఆర్‌ల వాదన. కేవలం రూ.15వేలనుంచి రూ.16వేల లోపు ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.1.5లక్షలకు పెంచేసిన రేవంత్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదనేది వారి వాదన.
నిజానికి ఈ మూసీ రివర్ ప్రాజెక్టు పొడవు 55 కిలోమీటర్లు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో విస్తరించిన కారిడార్ ఇది. ప్రాజెక్టు తొలిదశలో ఉస్మాన్ సాగర్, హిమయత్సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు పనులు చేపడతారు. ప్రస్తుత ప్రభుత్వం మొదట్లో రూ.58వేల కోట్ల అంచనాల తో ఈ మొత్తం ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ, అంతర్సిటీ మౌలిక సదుపాయాలు, మెట్రోరైల్విస్తరణ వంటివి కూడా జతచేయడంతో ప్రాజెక్టు ఖర్చు ఏకంగా రూ.1.5లక్షల కోట్లకు చేరింది.అయితే గత బీఆరఎస్ ప్రభుత్వం ప్రధానంగా మూసీనది నీటిని ప్రక్షాళన చేయడానికి ప్రాధాన్య తనిచ్చింది. ఇందుకోసం 31 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించి నీటిని శుద్ధి చేయడం తర్వాత గోదావరి జలాలను మూసీలోకి తరలించడం ద్వారా దీన్ని ఒక జీవనదిగా మార్చాలన్న ఉద్దే శంతో ముందుకెళ్లింది. ఈ సీవేజ్ ప్లాంట్లతో నగరాలనుంచి విడుదలవుతున్న 1200 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేయవచ్చునని బీఆరఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారు. 57.5 కిలోమీటర్ల పొడవునా నదికి ఇరువైపులా గోడలను నిర్మించడం ద్వారా వరదలను నివారించవచ్చన్నది ఆయన వాదన.
ఇందుకు ఉదాహరణగా నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు 5 కిలోమీటర్ల మేర ఇళ్లు కూలగొట్టకుండానే తాము అభివద్ధి చేసిన ప్రాంతాన్ని చూపుతున్నారు. అందువల్ల ఇళ్లు కూలగొట్ట కుండానే, మూసీనది పర్యావరణ వ్యవస్థను శుద్ధి చేయడం లక్ష్యంగా తమ ప్రణాళిక కొనసాగిం దని బీఆరఎస్ నేతలు చెబుతున్నారు.ఇందులో భాగంగానే స్ట్రాటిజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎసఎన్‌డీపీ)కింద డ్రైనేజీ, వరద నిర్వహణపై బీఆరఎస్ ప్రభుత్వం తొలిదశలో దష్టి కేంద్రీకరించడం వల్ల బుల్డోజర్లకు పనిచెప్పాల్సిన అవసరం రాలేదు. కాగా సింగపూర్‌కు చెందిన మె యిన్హార్దత్ కన్సార్టియమ్‌ను ఈ ప్రాజెక్టు డిపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారుచేయడానికి నియమించడాన్ని బీఆరఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇతరదేశాల్లో ఆర్థిక అవకతవకలు పాల్పడిన ఆరోపణలతో పాటు, లీగల్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్న ఈ కంపెనీకి మాస్టర్‌ప్లాన్, డీపీఆర్ పనులు అప్పగించడమేంటని బీఆరఎస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కింద మరో వివాదమేంటంటే బఫర్‌జోన్ పరిధిలో పదివేల నుంచి పదిహేనువేల నిర్మాణాలను కూలగొట్టాలని నిర్ణయించడం నిత్య నిరసనలకు దారితీసింది. దశాబ్దాల తరబడి ఇ క్కడ నివసిస్తూ ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తూ వస్తున్న తాము ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందన్న భయం ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. తగిన పరిహారం, ప్రత్యామ్నాయాలను చూపకుండానే ప్రభుత్వం తమను నిరాశ్రయులను చేస్తుందన్న భయం వీరి ఆందోళనకు, ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం. అదీకాకుండా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) లేదా ప్రజల పునరావాస పాలసీని ప్రకటించకుండానే, అధికార్లు కూలగొట్టాల్సిన ఇళ్లకు మార్కింగ్‌లు వేయడంతో, ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో నాటుకుపోయింది. ఈ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వసతి కల్పిస్తామని చెబుతోంది. అసలు విధానానికి తుదిరూపం ఇవ్వకుండా, బాధిత కుటుంబాలతో చర్చించకుం డా ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళుతుందని విమర్శకులు లేవనెత్తుతున్న ప్రశ్న.
ప్రభుత్వం మూసీ నది ఒడ్డున బాపూ ఘాట్ వద్ద “గాంధీ సరోవర”ను అభివద్ధి చేయాలని చూస్తున్నది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్నవారికి సమగ్ర పునరావాస చర్యలు చేపడతా మని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇందులో భాగంగా ఈ మూసీనది ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పో యే పేదలకోసం సుమారు 16వేల ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) యూనిట్లను కేటాయించింది. వీరిలో రివర్‌బెడ్‌లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం మానవతా సహాయంగా ఈ చర్య చేప ట్టింది. అయితే బఫర్ జోన్లలో నివాసం వుండేవారు “ఆరఎఫ్‌సీటీఎలఏఆరఆర్ చట్టం`2013” కింద నష్టపరిహారానికి అర్హులు. భూమి మార్కెట్ విలువతో పాటు, ఇంటి నిర్మాణ విలువను కూడా నిర్ణయించి ఆ మొత్తం చెల్లిస్తారు. ఇక ఎటువంటి పట్టాలు లేని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) కేటాయింపు వుంటుంది. ఇక రివర్‌బెడ్‌లో నివసించే కుటుంబాలు తరలి వెళ్లడానికి వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.25వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు ఈవిధంగా తరలించిన వారి జీవనోపాధి, వారి పిల్లలను సమీప స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక మధు పార్క్రిట్జ్ వంటి మధ్యతరగతి ప్రజలు నివాసముండే అపార్ట్మెంట్లకు రూ.80లక్షల నగదు పరిహారం లేదా ప్రభుత్వం గుర్తించిన 11 గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు ఐచ్ఛికాల్లో ఏదో ఒకదాన్ని అపార్ట్మెంట్ వాసులు ఎంచుకోవాల్సి వుంటుంది.
ఇక మూసీ ప్రాజెక్టు తొలిదశలో 300 ఎకరాల్లో బాపు ఘాట్‌ను ప్రపంచ స్థాయి ఎక్స్పర్మెంటల్ కేంద్రంగా అభివద్ధి చేస్తారు. ఇక్కడ 123 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతారు. ఇప్పటివరకు పాట్నాలో నిర్మించిన 72 అడుగల ఎత్తయిన విగ్రహం దేశంలోనే ఎత్తయినది గా పరిగణిస్తున్నారు. కాగా ఇక్కడ నిర్మించబోయేదీ దాన్ని అధిగమించనుంది. ఇక్కడే గాంధీ ఫి లాసఫీ, ఆయన సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన అతిపెద్ద నేషనల్ మ్యూజి యంను నెలకొల్పుతారు. స్థానిక సంప్రదాయ చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు వీలుగా ఒక హ్యాండ్లూమ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. నగరాన్ని వీక్షించేందుకు “లండన్ ఐ స్టెíల్ వీల”ను ఏర్పాటు చేయనున్నారు. ధ్యాన కార్యక్రమాల నిర్వహణకు మెడిటేషన్ విలేజ్‌ను ఏర్పాటు చేస్తారు.బాపు ఘాట్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపడతారు. ఇక్కడినుంచి దిగువకు ఫిల్టర్‌చేసి శుద్ధి చేసిన నీటినే దిగువకు వదిలేవిధంగా ఈ నిర్మాణం వుంటుంది.
తాము ఇళ్లను కూలగొట్టే అవసరం లేకుండానే మూసీనది ప్రక్షాలన చేయవచ్చునని బీఆరఎస్ నేతలు చేస్తున్న వాదనకు సమాధానంగా, 2020 నాటి వరదల విధ్వంసం పునరావతం కాకుండాచూడాలంటే, బీఆరఎస్ చేపట్టిన కార్యక్రమం సరిపోదని, మరింత విస్తరించాల్సిన అవసరం వున్నదని పట్టణ నిపుణులు, అధికార్లు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలంలో నగర భద్రతకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోదని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం నదినీటిని శుభ్రం చేస్తే సరిపోదు. నదీ ప్రవాహానికి తగినంత ప్రదేశం వుండాలి. నదీప్రాంతం ఆక్రమణలకు గురికావడం వల్లనీటి ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడి చుట్టుపక్కల నగర ప్రాంతాలకు ముంపునకు గుర య్యాయన్న సంగతిని వారు 2020 వరదలను ప్రస్తావిస్తూ వివరిస్తున్నారు. మరి బీఆరఎస్ ప్రభుత్వం 2017లో ఈప్రాజెక్టును మొదలు పెడితే ఇంతవరకు 31 సీవేజ్ ప్లాంట్ల నిర్మాణం, నదిలో అతిపెద్ద ఆక్రమణల తొలగింపు వంటివి పూర్తికాలేదన్న సంగతిని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక నదికి 50మీటర్ల బఫర్ జోన్ వుండాలి. వర దలనుంచి రక్షణకు ఈ బఫర్‌జోన్ తప్పనిసరి. ఇందుకోసం ఆయా ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించుకు న్నవారిని అక్కడినుంచి వేరే ప్రదేశానికి తరలించాల్సి వచ్చినా దీన్ని అమలు చేయాల్సిందేనని బఫర్ జోన్ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణ వంటి పరిమిత పనులకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోతుంది. కానీ ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్‌ను రూపొందించేందుకు పై ప్రణాళిక సరిపోదని, సమగ్రమైన రీతిలో వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని ప్రభుత్వం చెబుతున్నది.
