
Independence Day celebrations.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లో చీఫ్ విప్ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసినబీ79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ Lరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిం చారు వనపర్తి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై నివేదికను చీఫ్ విప్ చదివి వినిపించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అధికారులు పాల్గొన్నారు
పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కలెక్టర్ ఎమ్మెల్యే లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు వనపర్తి
జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు.
ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్. రవి నాయక్ టీజీఎమ్ఎస్ పెబ్బేరు మధుగాని కళ్యాణి టీజీఎమ్ఎస్ పెబ్బేరుకే నరేష్ టీజీఎమ్ఎస్ ఘనపూర్ వి మౌనిక టీజీఎమ్ఎస్ ఘనపూర్లకు ఒక్కొక్కరికి పదివేల చెక్కును అందజేశారు స్థానిక సంస్థలలో
విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బి సి బిల్లులను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ఆమోదించిందన్నారు
వనపర్తి జిల్లాలో పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ
గంజాయి, డ్రగ్స్, ఇతర మపదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిసూ టీమ్స్ బస్టాండ్లలో కళాశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహినచడపై పోలీసులను అభినందించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ వీరా రెడ్డి, డీఎస్పీలు, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని ప్రజాప్రతినిధులు చిన్నారులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.