Phule Jayanti Wall Poster Released
గోడపత్రిక విడుదల
యాదాద్రి నేటి ధాత్రి:
పూలే జయంతి గోడపత్రికలను విడుదల చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగల్లపల్లి శ్రీవాణి రవికుమార్,
దేశవ్యాప్తంగా ఏప్రిల్ మాసంలో జరగనున్న మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతినీ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా, పూలే జయంతి ఉత్సవ కమిటీ ఈరోజు బోనగిరి పట్టణ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో, పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, ముఖ్యఅతిథిగా భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ గారి చేతుల మీదుగా గొడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బోనగిరి పట్టణంలో ఈనెల 11న జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని విజయవంతం చేయడం కోసం ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు తరలిరావాలని వారి ఆశయాలను మనము ముందుకు తీసుకు వెళ్లే విధంగా వారి ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం కోసం జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి రవికుమార్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో పూలే ఉత్సవ కమిటీ కన్వీనర్ కొత్త నరసింహస్వామి, సంగం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు గొట్టిపాముల బాబురావు, బీసీ సంఘం గౌరవ సలహాదారులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఒక్కదు సోమయ్య, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సావన్ కార్ వెంకటేష్, జినా మల్లేష్, సిరికొండ శివకుమార్, పంచద్దులబలరాం, మాటూరు బాలేష్, కుర శివకుమార్, పిట్టల బాలరాజ్, రత్నపురం పద్మ, ఫిబ్రవరిలో ప్రవీణ్, కుమార్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి గోపాల్, ధర్పల్లి ప్రవీణ్ కుమార్, మిర్యాల శ్రీనివాస్, రాజు, నక్కల పాండు, తదితరు బీసీ నాయకులు పాల్గొన్నారు.
