Water Shortage Hits Kesamudram Village
నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు
మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం
రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
