
"3 Months Without Pay"
మూడు నెలలుగా అందని వేతనాలు
◆:- ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల దుస్థితి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల అభివృద్ధి కార్యాలయంలో విధులు నిర్వహి స్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మూడు. నెలలుగా వేతనాలు అందకపోవడంతో పండుగకు పస్తులు ఉండవలసిన పరిస్థితి దాపురించిందని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం ఝరాసంగం మండల అధ్యక్షులు రవి కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 25 మండలాలలో 72 మంది ఈ పంచాయతీ ఆపరేటర్ కార్మికులు గా కొనసాగుతున్నారు. ఒక్కొక్కరికి 5.19500 చొప్పున వేతనాలను అందిస్తుండటంతో చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వాపోయారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రతినెల వేతనాన్ని అందించాలని కోరు తున్నాము తప్ప పర్మనెంట్ చేయమని కోరడం లేదన్నారు. 2015 నుండి ఇప్పటివరకు ప్రభుత్వానికి అనేక రకాలైన సేవలను అందజేస్తున్నమన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వము మమ్ములను గుర్తించకుండా వేతనాలను ప్రతి నెల అందజేయకపోవడంతో కుటుంబ పోషణ భారమై భార్య పిల్లలు ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నామని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కూడా వేతనాలు సమయానికి చెల్లించకపోవడంతో పండుగకు అప్పు పుట్టక పోవడంతో కుటుంబాలకు షాపింగ్ కూడా చేయలేకపోతున్నామన్నారు.