స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

TTD administration

*స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.
వివక్ష వీడాలి:

*టీటీడీ పరిపాలన భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో కందారపు మురళి డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

 

స్విమ్స్ కార్మికుల కు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం టీటీడీ జేఈవో వీర బ్రహ్మం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ధర్నా ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికుల కు వేతనాలు పెంచటం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, కార్మికుల జీవితాలు వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.

గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయులుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు.

పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడo, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్ ల్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

గతంలో మూడుసార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించినాస్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం,సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తరువాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందని అన్నారు.

టీటీడీ స్విమ్స్ పై స్విమ్స్ టీటీడీ పై ఒకరి ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కారం చేయడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, టీటీడీ ఈవో కు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎప్పటికైనా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.

సానుకూలంగా స్పందించిన జేఈవో వెంటనే ఈ సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారి ముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!