తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ డిమాండ్
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన బీడీ కార్మికుల తో సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీడీ కార్మికులకు 2000 రూపాయల జీవన భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆంక్షలతో 2014 కటప్ డేట్ తో జీవన భృతి మంజూరు చేయడం జరిగిందని ఆ తరువాత 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ జీవన భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తదానంతరం అసెంబ్లీ సమావేశంలో 2014 కటప్ తేదీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందని కానీ గడిచిన ఐదు సంవత్సరాలలో కటప్ తేదీ ఎత్తివేయకపోగా కొత్తగా ఏ ఒక్కరికి కూడా జీవన భృతి అందించలేదని అన్నారు అదేవిధంగా గతంలో తెలంగాణ ఆవిర్భావానికి ముందు బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్స్ బీడీ కార్మికులు ఇండ్లు నిర్మించుకోవడానికి రుణాలు మంజూరు చేసే వారిని కానీ గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీడీ కార్మికుల పథకాలు పూర్తిగా తొలగించి బీడీ కార్మికులకు అన్యాయం చేయడం జరిగింది అదేవిధంగా బీడీ కార్మికుల ఆరోగ్యం రీత్యా వారికి ఈఎస్ఐ హాస్పిటల్ నాంపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ కు సంబంధించి తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో దాదాపు 26 ఎకరాలు స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు కనీసం నిర్మాణ పనులు చేసినటువంటి దాఖలకు లేవు అదేవిధంగా నాంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్లో వేములవాడ పట్టణంలోకి మార్చాలని అనేకమార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు.
కావున ఇప్పుడు బీడీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని ఎవరైతే ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో పెడతారు వారికే బీడీ కార్మికులు ఓట్లు వేస్తారని డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో కనగర్తి గ్రామంలోని బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.