
గ్రామము మొత్తం ఏకగ్రీవ తీర్మానం
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
శాయంపేట : నేటిధాత్రి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని నరసింహులపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి మరియు గండ్ర జ్యోతి పర్యటించారు. గ్రామాలలోనీ ప్రజల గణ స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో భూపాలపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.బిఆర్ఎస్ కంచుకోటగా గుర్తింపు పొందినందున అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమ వ్యక్తం చేశారు కెసిఆర్ పెట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు.తనకు అవకాశం కల్పించాలని అభివృద్ధిని చేసి చూపించాను.నేను ఓటర్లే తన దేవుళ్లని, తాను పూజారిగా సేవలు చేస్తాను. పెద్ద ఎత్తున ప్రజలు. ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.