
ఆదివాసీలకు “తుడుం దెబ్బ” పిలుపు.
కొత్తగూడ, నేటిధాత్రి :
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా ఓటు బ్యాంక్ కల్గి ఉన్న ఆదివాసీల మనోభావాలను కించ పరుస్తూ అధికార కాంగ్రెస్,బీజేపీ, గత ఐదు నెలల ముందు అధికారం లో ఉన్న బిఆర్ యస్ పార్టీ ఈ మూడు భూర్జవ రాజకీయ దోపిడీ పాలక వర్గ పార్టీలు ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకుండా కుట్రలు చేసి ఆదివాసీల ఓట్లకోసం నేడు ఎక్కడా లేని ప్రేమ ఒల్క పోస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఆదివాసీలు తమ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి అక్రమంగా ST లలో చలామణి అవుతున్న వారిని గెలిపించాలని వారిని గెల్పిస్తే ఆదివాసీలను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నాయని మూడు ప్రధాన భూర్జవ రాజకీయ పార్టీ లైన కాంగ్రెస్,బీజేపీ,బి ఆర్ యస్ లు ద్వంద విధానాలతో ఆదివాసీలను మోసం చేసేందుకు సిద్దమైనాయని ఆయా పార్టీల కుటిల బుద్దిని ఆదివాసీ సమాజం గుర్తించాలని ఈ మూడు రాజకీయ పార్టీలలో కొన సాగుతున్న ప్రజా ప్రతినిధులు నాయకులు ఆదివాసీ జాతి ఆస్థిత్వం ను మర్చి పోయి తమ స్వార్ధం కోసం రాజకీయ పార్టీల ఎజెండాలను మోస్తూ ఆదివాసీ ల ను ఆయా పార్టీలకు తాకట్టు పెట్టి ఆదివాసీ సమూహం ను బలి చేస్తున్నారని అందుకే తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డా మైపతి అరుణ్ కుమార్ ను జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి బరిలో ఉంచడం జరిగిందని ఇందుకు గాను డా,అరుణ్ కుమార్ గారి సింహం గుర్తు పైన తమ అమూల్య మైన ఓటు వేసి గెల్పించెందుకు ప్రతి ఆదివాసీ గూడెంల లోని ఆదివాసీ ప్రజలు ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు,ఆదివాసీలతో సహజీవనం చేస్తున్న ఆదివాసేతరులు ప్రజా స్వామిక వాదులు విభిన్న సామాజిక వర్గాల ప్రజలు ఆదివాసీల మనోభావాలు కాపాడటం కోసం సహకరించాలని ఈ రోజు కొత్తగూడ మండలం లోని వివిధ గ్రామాల్లో అరుణ్ కుమార్ గెల్పు కోసం ప్రచారం లో పాల్గొన్నారు కార్యక్రమం ఆగబోయిన రవి,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఈక విజయ్ కుమార్ మహేందర్,మునీందర్ యాదగిరి, రాజేష్,సూర్యనారాయణ,మనోహర్,లు పాల్గొన్నారు.