ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి.
చిట్యాల నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటువేయలని ప్రచారం చేశారు.కారు గుర్తుకు ఓటు వేయాలని – మరో సారి ఎమ్మెల్యే గా సేవ చేసే భాగ్యం కల్పించాలని సోమవారం రోజున చిట్యాల మండలం లక్ష్మీపురం తండా,ఒడితల, పాశిగడ్డ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో మూడోసారి బి ఆర్ ఏస్ పార్టీకి పట్టం కట్టాలని కోరిన భూపాలపల్లి నియజవర్గ శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకి అమలుకు ఆమోద యోగ్యంగా ఉండాలని మేనిఫెస్టో తెచ్చారని తెలిపారు.గ్రామాల్లో గతం కంటే నేడు గణనీయమైన అభివృద్ధి జరిగిందని, మరో అవకాశం కల్పిస్తే భూపాలపల్లి శాసన సభ్యుడిగా మీకు సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలోఎంపీపీ వినోద వీరారెడ్డి జడ్పీటీసీ గొర్రె సాగరు సర్పంచులు ఎంపిటిసిలు టిఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.