
-ఏపీఎం కందిక సుధాకర్
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో నెలవారీ విఓఏల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా కార్యలయం నుండి డిఆర్డిఏ అదనపు డిఆర్డిఏ గొట్టె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వారు మాట్లాడుతూ మండలం లోని విఓఏ లు అందరూ ఎస్ఈఆర్పి కార్యక్రమాలైన సంఘాల సమావేశాలు, అకౌంటింగ్ రోజు వారీ గా షెడ్యూల్ ప్రకారం ఎంట్రీ పూర్తి చేసి సంఘాల గ్రేడింగ్ ఏ ,బి గ్రేడ్ లలో వచ్చే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా లోకోస్ అప్ లో సంఘాల వివరాల ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే బ్యాంక్ లింకేజ్ వచ్చే నెల మొదటి వారం లోపు 100% రుణాలు అవసరమున్న సంఘాలకు సభ్యులకు ఇప్పించాలి. అలాగే నాన్ ఫార్మ్స్ సబ్జెక్ట్ లో ఆదాయాన్ని పెంపొందించే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని వాటి ద్వారా ఆదాయాన్ని పొంది తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అలాగే మహిళా రైతు సంఘాలను ఇంకా మరిన్ని ఏర్పాటు చేసుకొని పండించిన పంటలకు గిట్టు బాటు ధర పొందవచ్చు మరియు మధ్య దళారీ వ్యవస్థ ను దాటుకొని అధిక గిట్టుబాటు ధరను పొంద వచ్చన్నారు.ఈ సమావేశం లో స్థానిక ఏపీఎం కందిక సుధాకర్, డీపీఎం దయాకర్, డీపీఎం చంద్రశేఖర్, డీపీఎం భవాని, సీసీ లు, అన్ని విఓల విఓఏ లు, మండల సమాఖ్య ప్రతినిధులు కవిత, క్రిష్ణ కుమారి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.