మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ప్రమాదవసత్తు రోడ్డు ప్రమాదం లో మరణించిన నాయిని స్వామి కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి జడ్చర్ల శాసన సభ్యులు డాక్టర్ చర్లకోలా లక్ష్మారెడ్డి పరామర్శించరు..
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మొదం పల్లి గ్రామానికి చెందిన బాలానగర్ మండల యూత్ వింగ్ నాయకులు,మొదం పల్లి మాజీ వార్డ్ సభ్యులు నాయిని స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి,
నాయిని స్వామి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని భరోసా అందిచారు.. వారి మృతికి సంతాపం తెలిపిన ఆయన తన వంతు సహాయంగా 1,00,000/- రూపాయలను, బిఆర్ఎస్ పార్టీ తరుపున 2,00,000/- ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మొదం పల్లి గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొని నాయిని స్వామి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు..