https://epaper.netidhatri.com/view/320/netidhathri-e-paper-16th-july-2024%09
`దటీజ్ సిఎం. చంద్రబాబు నాయుడు అంటున్న ‘‘అనిమిని రవినాయుడు’’ నెల రోజుల పాలనపై అందించిన అద్భుతమైన విశ్లేషణ ఆయన మాటల్లోనే…
`చంద్రబాబు నోట తర తరాలు గుర్తుంచుకునే మాట.
`నాయకులం కాదు సేవకులం.
`తెలుగు దేశంలో పాదాభివందనాలకు స్వస్తి.
`మంత్రులకు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.
`కార్యకర్యలకు నిత్యం అండగా వుండాలి.
`ప్రజాసేవలో ఆదర్శంగా వుండాలి.
`అమరావతిని గొప్పగా అభివృద్ధి చేయాలి.
`తెలుగు నేల పులకించిపోవాలి.
`ప్రగతిలో ఏపి పరుగులు.
`రాజకీయంగా కొత్త ఒరవడులు.
`నెలలోనే అద్భుతాలు!
`రోజుకో గొప్ప కార్యక్రమం.
`ఐదేళ్ళలో ఏపి మహాద్భతం.
`గతంలో ఎవరూ చేయలేదు.
`భవిష్యత్తులో చూడలేము.
`ఔడేటెడ్ లీడర్ అన్న వాళ్ల నోర్లు మూయబడ్డాయి.
`నెల రోజుల్లోనే కనిపించే అభివృద్ధి వాళ్ల కళ్లు తట్టుకోలేకపోతున్నాయి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సహజంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిజమైన పనులు మొదలు కావడానికి అభివృద్ది పట్టాలెక్కడానికి కనీసం ఓ మూడు నాలుగు నెలలు పడుతుంది. ప్రగతి పరుగులు పెట్టాలంటే ఓ ఏడాది పడుతుంది. కాని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అభివృద్ది నమూనాలు, ప్రగతి వేగం అందుకోవడం అంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లేనే అవుతుందనేది అక్షర సత్యం. గత అనుభవాలతోపాటు, అంకిత భావం వున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగు నేల అంటే ఆయనకు ప్రాణం. తెలుగు జాతి అంటే ఆయనకు ఎంతో గౌరవం. తెలుగు ప్రజల ప్రగతి ఆయనకు ఎంతో ముఖ్యం. ఇష్టం. తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన రాజకీయాల్లో వేసిన అడుగులు చరిత్రలో ఒక సువర్ణాక్షరాలు లిఖించబడతాయి. సహజంగా ఏ నాయకుడైనా ఎదిగే అవకాశాలు వచ్చినప్పుడు మరో మెట్టు ఎక్కాలని చూస్తారు. రాజకీయంగా తన భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని చూస్తారు. కాని తెలుగు నేల తప్ప రాజకీయంగా మరో వైపు చూడని ఏకైక ఆదర్శవాది చంద్రబాబు నాయుడు అంటున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తిరుపతి పట్టణ తెలుగుదేశం పార్టీ నేత అనిమిని రవి నాయుడు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు వెల్లడిస్తున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే తన పాలన మొదలు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి రోజే 16,347 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ వేసి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హమీ నెరవేర్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు డిఎస్సీ వేసి, కొన్ని లక్షల మంది ఉపాధ్యాలతో ప్రభుత్వ విద్యను పేదలకు దరి చేర్చిన పాలకుడు చంద్రబాబు. అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 45వేల ఖాళీలతో 1997లో మెగా డీఎస్సీ వేసి ప్రభుత్వ విద్యపై ఆయనకు వున్న మక్కువను తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని అనేక అప్పర్ ప్రైమరీ స్కూళ్లన్నింటినీ హైస్కూళ్లుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడిది. అంతే కాదు ఏకోపాధ్యాయ పాఠశాల స్ధానంలో ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి పల్లెల్లో విద్యా వికాసాన్ని నింపిన పాలకుడు చంద్రబాబు నాయుడు. పేదలకు విద్యను చేరువ చేయడంలో ఆయన పోషించిన పాత్ర ఎవరూ పోషించలేదని చెప్పాలి. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు అంతకు ముందు నెల ఫించన్‌తోపాటు, ప్రస్తుత నెల పించన్ కూడా కలిపి రూ.7వేల రూపాయలు అందజేయడంతో ప్రజల్లో నెలకొన్న ఆనందం అంతా ఇంతా కాదు. అవ్వా, తాతలు ఆ డబ్బులను చూపిస్తూ మురిసిపోయారు. తమ ఆకలికి, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది వుండదన్న సంతోషం వారిలో వెల్లివిరిసింది. చంద్రబాబును తెలుగు నేల వేనోళ్ల కొనియాడిరది. అదే సమయంలో దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేస్తామనిచెప్పారు. రూ.6000వేలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఇంటి వద్దకు వెళ్లి పించన్లు పంపిణీ చేయించారు. ఇక ఏపి రాజకీయాల్లోనే ఒక సంచలనం నమోదు చేశారు. గత ప్రభుత్వంలో ఇసకను బంగారంగా అమ్ముకున్నారు. ప్రజలను దోచుకున్నారు. మాఫీగా మారి ఇసుకాసురుల అవతారమెత్తారు. ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరంలాంటి ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. దాంతో ప్రజలు సంతోషానికి అంతులేదు. ఎందుకంటే ఇసుక ఉచితంగా ఇవ్వడం మూలంగా పేద ప్రజలు కూడా ఏదైనా నిర్మాణం చేసుకోవాలంటే కూడ ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఒక లారీ ఇసుక కొనుగోలు చేయాలంటే కనీసం రూ.70వేల వరకు ఖర్చయ్యేది. కాని ఇప్పుడు కనీసం పది వేల రూపాయలు కూడా కావడం లేదు. ఆ ఖర్చు కూడా ట్రాన్స్‌పోర్టు కోసమే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించొద్దన్న గొప్ప ఆలోచనతో గతంలోనే ఎన్టీఆర్ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి, పేదలకు కేవలం ఐదు రూపాయలకు నాణ్యమైన భోజనం పెట్టిన నాయకుడు చంద్రబాబు.
గత ప్రభుత్వం పేద ప్రజలు కడుపునిండా అన్నం కూడా తిననివ్వకుండా నోటి కాడి ముద్ద లాగేసుకొని పాపం చేశారు. అందుకే పాపం పండిరది. వైసీపి ఘోరంగా ఓడిరది. మళ్లీ చంద్రన్న రాజ్యంవచ్చింది. ఆగష్టు నుంచి 15 నుంచి మళ్లీ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేద వారి ఆకలి తీరనున్నది. అన్న క్యాంటీన్లలో ఒక్క పూట కాదు ఉదయం టిఫిన్‌తో మొదలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా భోజనాన్ని అందించడం విశేషం. అంత గొప్ప కార్యక్రమం మళ్లీ రాష్ట్రంలో ఎప్పుడు మొదలౌతుందా? అని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి అన్న పదం వినపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డ్రగ్స్ అనే మాటే ఏపిలో వినిపించకుండా చేస్తున్నారు. వాటి కట్టడికి గట్టి చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణతో పాలకులే దోచుకోవడం గత ఐదేళ్లలో చూశాం. ఎర్రచందనాన్ని ఎవరు అక్రమ రవాణా చేసినా ఉక్కుపాదంతో అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది రాజధాని అమరావతి నిర్మాణం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతం వెలుగులతో వెలిగిపోతోంది. మళ్లీ సోమవారం పోలవరం వచ్చింది. పోలవరం పూర్తికి అవసరమైన పనులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే స్కిల్ సెన్సెస్ కూడా మొదలైంది. ఇది దేశంలోనే సంచలనమని చెప్పకతప్పదు. ఏ కుటుంబంలో ఎంత మంది విద్యావంతులున్నారు. వారు చదివిన చదవేమిటి? వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నది నిర్ణయించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తరమైన కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడా చేసి వుండరు. అందుకే చంద్రబాబు నాయకుడును విజన్ లీడర్ అంటారు. విజనరీకి పర్యాయ పదం చంద్రబాబు అని కొనియాడుతారు. తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల చేశారు. ఎంత మంది వుంటే అంత మంది పిల్లకు తల్లికి వందనం అమలుకు శ్రీకారంచుట్టారు. ఇక వైసిపి కొరివితో తలగోక్కున్నట్లు చేసిన పట్టాదారు పుస్తకాల స్ధానంలో రాజముద్రతో కూడిన పుస్తకాలు అందజేసే కార్యక్రమం త్వరలో మొదలు కానున్నది. పట్టి సీమ నుంచి మళ్లీ కృష్ణా డెల్టాకి నీరు అందించే క్యార్యక్రమం మొదలౌతోంది. ఇక చంద్రబాబునాయుడు అడుగు పెట్టడంతోనే భోగా పురం ఎయిర్‌పోర్టుకు మళ్లీ కళొచ్చింది. ఎయిర్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు 2026లోగా ఎయిర్ పోర్టు పనులు పూర్తి కావలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. భక్తులకు సౌకర్యాలు పెరిగాయి.
మళ్లీ తిరుమలలో ఆహ్లాదకరమైన ఆద్యాత్మిక వాతావరణం నెలకొన్నది.
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రతిపానలను కేంద్రం అంగీకరించింది. ఒక్కసారిగా అమరావతి ప్రాంతానికి కళొచ్చింది. యుద్ద ప్రాతిపదికన పనులు కూడా మొదలౌతున్నాయి. జీతాలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూసే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించారు. వారికి మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు. ఐదేళ్లుగా నీటి విడుదల లేక అల్లాడిన పిఠాపురానికి అవసరమైన నీళ్ల కోసం పురుషోత్తమ పట్నం నీళ్లు అందించారు. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది. అపరిషృతంగా వున్న విభజన సమస్యలపై కూడ అడుగులు ముందుకు పడ్దాయి. నిత్యావస వస్తువుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు కొనియాడుతున్నారు. ఇకపై దళారుల దోపిడీ వుండదు. ప్రభుత్వం తక్కువ ధరకు సరుకులు అందించడం గొప్ప శుభపరిణామం. ఇతంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు మరో గొప్ప పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో కాళ్లు మొక్కే సంస్కృతి వుండొద్దని ఆదేశాలు జారీచేశారు. మనం ప్రజలకు సేవకులమే అన్నారు. అందుకు ఎవరూ ఏ నాయకుడి కాళ్లు మొక్కొద్దని చెప్పారు. ఎవరైనా తన కాళ్లు మొక్కితే మళ్లీ నేను మొక్కుతా అనడంతో అందరూ ఆశ్యర్యపోయారు. చంద్రబాబుకు జేజేలు పలికారు. అదీ చంద్రబాబు నాయుడు అంటే….