రామడుగు, నేటిధాత్రి:
జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు మాధురి, మౌనికలను పద్మశాలి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈసందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ మన ప్రాథమిక వైద్య అధికారులు సిబ్బంది అందరి సహాయ సహకారంతో 24 గంటలు మెరుగైన వైద్యం అందించడంతో గతంలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాయకల్ప అవార్డు రావడం, ఎంతోమంది వైద్య సిబ్బందికి ఉత్తమ అవార్డులు రావడం జరిగిందని, ఇంకా ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు, టిఆర్ఎస్ యూత్ మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్, యువజన నాయకులు సిరిపురం గంగరాజు, కొలిపాక ప్రవీణ్, కొలిపాక అజయ్ కుమార్ ప్రవీణ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.