· మున్నూరు కాపు సంఘం ఆధ్వరంలో నిర్వహణ
· విశ్వశాంతి మహాయజ్ఞంలో పాý£్గననున్ను 108 మంది దంపతులు
· 1008 దంపతులచే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
· చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులచే ప్రవచనం
· సాంస్కతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
· మున్నూరు కాపు సంఘం భవన్లో కార్యక్రమాల నిర్వహణ
· ఐదువేల భక్తులు హాజరవుతారని అంచనా
· మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాద వితరణ
· భక్తులకు నిర్వాహకుల ఆహ్వానం
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ 19న మున్నూరు కాపు భవన్లో “విశ్వశాంతి మహాయజ్ఞాన్ని” నిర్వహించనున్నారు. ఇదే సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మీVAత్సవం కూడా జరుపుతారు. ఈ బహత్ కార్యక్రమంలో పాý£్గనేందుకు కేంద్ర ీVAంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించారు. ప్రపంచం యుద్ధాలతో అట్టుడికిపోతున్న తరుణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 19న, ఉదయం 6 గంటనుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతా యి.
వీటిల్లో అతి ముఖ్యమైనవి 108 దంపతులతో శ్రీ సుదర్శన నరసింహ విశ్వశాంతి మహాయజ్ఞం, 1008 దంపతులతో నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఈ సందర్భంగా చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సి.ఎస్. రంగరాజన్ తన ప్రవచనాన్ని వినిపిస్తా రు. మహిళలు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఐదువేల మంది భక్తులు హజరవుతారని అంచనా వేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాý£్గని స్వామి కపకు పాత్రులు కావాలని మున్నూరు కాపు సంఘం నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఉదయం 6 గంటలనుంచి 8గంటల వరకు గణేష్ పూజ వుంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తారు. 12 నుంచి 1.30 గంటల వరకు శ్రీ లక్ష్మీ నార సింహ కళ్యాణ మీVAత్సవం జరుపుతారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు అన్న ప్రసాద వితరణ, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ పరాయణం, సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తా రు. రాత్రి 7గంటల నుంచి 8.30 గంటల వరకు ఆధ్యా త్మిక ప్రసంగాలు, రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు సాంస్కతిక కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
“విశ్వశాంతి మహా యజ్ఞానికి” భక్తులందరూ విచ్చేసి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ మీ..
గుండు జగదీష్ కుమార్ (జీఖ)
ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్
9848195080
కట్ట శివ సుబ్రహ్మణ్యం
సీఈఓ “నేటిధాత్రి 9” డిజిటల్ మీడియా, ఎడిటర్ నేటిధాత్రి, డైరెక్టర్ ధాత్రి గ్రూప్స్
8520007444
యాదాద్రి క్షేత్ర చరిత్ర
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలో పురాతన పుణ్యక్షేత్రం. ఇది శ్రీమహావిష్ణు వు అవతారమైన లక్ష్మీనరసింహస్వామి కొలువైవున్న క్షేత్రం. పురాణ కథనం ప్రకారం యాద మహర్షి ఇక్కడి గుహలో తపస్సు చేయగా అందుకు సంతోషించిన లక్ష్మీనరసింహస్వామి ఐదు రూ పాల్లో ఆయనకు దర్శనమిచ్చారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని పంచ నారసింహక్షేత్రమని కూడా పి లుస్తారు. బీఆరఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా, చిన్నజీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఈ ఆలయాన్ని పూర్తి రాతితో పునర్నిర్మించారు.
పురాణ కథనం ప్రకారం త్రేతాయుగంలో ఋష్యశంగ మహర్షి కుమారుడైన యాద రుషి కొండ పై వున్న గుహలో నరసింహస్వామికోసం దీర్ఘకాలం తపస్సు చేశారు. ఆయన తపోదీక్షకు సంతసించిన స్వామి, జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్ర, లక్ష్మీ నరసింహస్వామి రూపాల్లో ఆ యనకు దర్శనమిచ్చారు. జ్వాలా నరసింహ స్వామి సర్పరూపంలో, యోగానంద నారసింహుడు ధ్యానముద్రలో, గండభేరుండ నరసింహుడు పక్షి రూపంలో, ఉగ్రనరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన రూపంలో, లక్ష్మీ నరసింహుడు శాంతమూర్తి మహాలక్ష్మితో కలిసి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభువు. గుహలో స్వయంగా వెలిసారు. యాద మహర్షి తపస్సు చేసినందువల్ల ఈ కొండకు యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. ఈ ఆలయ మూలాలు స్కందపురాణంలో కనిపిస్తాయి. ఆలయశిఖరంపై బంగారు సుదర్శన చక్రం అమర్చబడి వుంటుంది. ఇది భక్తులకు మార్గనిర్దేశం చేస్తుందని, కొన్ని సార్లు దానంతట అదే తిరుగుతుందని నమ్ముతారు.
2014 తర్వాత ఉక్కు వాడకుండా సాంప్రదాయ పద్ధతుýను అనుసరించి ఆలయాన్ని ఒక భారీ రాతి కట్టడంగా నిర్మించారు. ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో, హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ఆలయం వైష్ణవ ఆగమశాస్త్రాలలోని పూజ్యమైన టెంకలై సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ నరసింహస్వామి ఐదు రూపాల్లో కొలువై వున్నందువల్ల దీన్ని “పంచ నారసింహ క్షేత్ర”మని పిలుస్తారు.
క్రీ.శ.12వ శతాబ్దలో కాకతీయులు, ఆ తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకష్ణ దేవరాయలు ఈ దేవాలయాన్ని సందర్శించి అభివద్ధి చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ స్వా మిని “వైద్య నరసింహ” అని కూడా పిలుస్తారు. నలభయి రోజుల పాటు మండల ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించారు. సిమెంట్ స్టీల్ వాడకుండా కేవలం కష్ణశిలతో ఆగమ శాస్త్రాల ప్రకా రం ఆలయ నిర్మాణం అద్భుత రీతిలో సాగింది. గర్భాలయ విమాన గోపురానికి పెద్ద ఎత్తున బంగారం తాపడం చేశారు.
“విశ్వశాంతి మహా యజ్ఞానికి” భక్తులందరూ విచ్చేసి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ మీ..
గుండు జగదీష్ కుమార్ (జీఖ)
ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్
9848195080
కట్ట శివ సుబ్రహ్మణ్యం
సీఈఓ “నేటిధాత్రి 9” డిజిటల్ మీడియా, ఎడిటర్ నేటిధాత్రి, డైరెక్టర్ ధాత్రి గ్రూప్స్
8520007444
