పరకాల నేటిధాత్రి
ఎన్నో ఏళ్లుగా చేతి వృత్తులు చేసుకునే పంచ వృత్తుల వారైనా విశ్వ బ్రాహ్మణులకు ఇప్పుడున్న కాలంలో పోటా పోటీగా నడుస్తున్న కార్పొరేట్ సంస్థలు పెరిగిపోవడం వల్ల విశ్వకర్మ లకు ఉపాధి దొరకడం చాలా కష్ట తరంగా మారింది.ఒకప్పుడు తమ చేతితో ఆభరణాలను సుందరంగా మలిచినా ఆ కళ కార్పొరేట్ సంస్థల వల్ల చెదిరిపోయేలా కనపడుతుందని విశ్వకర్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని,చేతి వృత్తిని నమ్ముకున్న విశ్వకర్మ లను మునుపున్న ప్రభుత్వాలు ఆదుకున్నది లేదని 50ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు ఏర్పాటు చేయాలనీ అలాగే విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలు అందించాలని వరంగల్ తూర్పు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,విశ్వకర్మ ట్రస్ట్ అధ్యక్షులు ఎదులాపురం కార్తీక్ ప్రభుత్వంను కోరడం జరిగింది.