New Sarpanch and Deputy Felicitated in Nadikuda
నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ లను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని నడికూడ గ్రామ నూతన సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు,ఉప సర్పంచ్ తరిగొప్పుల సంపత్ లను విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ తల్లి దేవాలయం నందు శాలువాతో సత్కరించి,పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల కంటి రాజు చారి,ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి,ప్రధాన కార్యదర్శి బండ్ల రాజు చారి, కోశాధికారి కడివెండి ప్రశాంత్ చారి,సహాయ కార్యదర్శి బండ్లోజు రమేష్ చారి,క్రిష్ణాది సాంబయ్య చారి,సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
