# నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్
# ఎన్నికల పట్ల రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
రాబోయే శాసనసభ ఎన్నికలలో రాజకీయ పార్టీల నాయకులు,పలువురు ఎన్నికల కోడ్
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల పట్ల రాజకీయ నాయకులతో ఎస్సై జక్కుల పరమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధిగా హాజరైన సీఐ కిషన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ
ఎన్నికల నియమావళికి అనుగుణంగా మెదలాలన్నారు.
దుగ్గొండి సీఐ కిషన్ మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు గ్రామానికి ఒక్కో పార్టీ నుండి ముగ్గురిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బైండోవర్ చేస్తామని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయద్దని నిబంధనలకు విరుద్ధంగా
పోస్టు చేసిన వ్యక్తిపై ,గ్రూపు అడ్మిన్ పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం కోసం ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు.ఎన్నికల ప్రచారంలో కుల, మత కలహాలకు చోటివ్వద్దన్నారు.డబ్బు మద్యంతో ఓటర్లకు ప్రలోబం పెట్టద్దని సూచించారు. ప్రజలను,ఓటర్లను వివిధ రాజకీయ పార్టీల నాయకులు,కార్యకర్తలు భయాందోళనలకు గురి చేయద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై విజయ్ కుమార్ ,సిబ్బంది రాకేష్ గౌడ్,రాజశేఖర్,బిఅర్ఎస్,కాంగ్రెస్,భాజపా,సిపిఎం లతో పలు పోలికల్ లీడర్స్ పాల్గొన్నారు.