
Vinayaka Navaratri Celebrations.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వినాయక మండపం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డిజె సౌండ్ వాడవద్దని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.