
గొల్లపల్లి నేటి ధాత్రి :
నవరాత్రుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు మంగళవారం నిమజ్జనోత్సవానికి బయలుదేరాడు.ఆయా మంటపాలవారు గణేష విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేసి శోభాయాత్రగా గొల్లపెల్లి పట్టణ ప్రధాన వీధుల గుండా చెరువుకు నిమజోత్సవానికై ఇజం యూత్ సభ్యులు డప్పు చప్పుళ్ళు,మంగళవాద్యాల నడుమ యువత మరియు మహిళలు ఆటపాటలతో కోలాటలాటలతో తరలించారు.కాగా స్థానిక బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయా విగ్రహ మంటపాల నిర్వహకుల వారికి స్వాగతం పలికరు కాగా బాబు జగ్జీవరామ్ సంఘం లంబోదరణకి ఈ గ్రామంలోని కొన్ని కుల సంఘాల పెద్దలు ప్రతి ఏటా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడ లంబోదరునికి మొక్కిన మొక్కులలో అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నామని వారు నమ్మకంగా భావిస్తున్నారు. ఈ లంబోదరని ప్రత్యేకత కాగా స్థానిక పోలీస్ అధికారులు ప్రత్యక్ష భద్రత ద్వారా శోభాయాత్ర వేడుకలను సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సై చిర్ర సతీష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిఘా నీడలో నిమజ్జనోత్సవం వేడుకలు కొనసాగించారు. బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యులు వారు ఇక్కడ లడ్డు ప్రసాదం ప్రతి సభ్యునికి చేరవేస్తారు. తదుపరి వినాయక విగ్రహమును నిమజ్ఞోత్సవాన్ని కొనసాగించారు.