మంచిర్యాల, నేటి ధాత్రి:
అదనపుకలెక్టర్ మోతీలాల్
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక గణపతి పూజా అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ పేర్కొన్నారు.గురువార జిల్లా కేంద్రంలో చున్నం బట్టి వాడలోని అంజని పుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూవినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు గణపతి పూజా వేడుకలా జరుపుకోవడం మన సంప్రదాయానికి ప్రతీక అన్నారు. అంజనీ పుత్ర సంస్థ సేవలుఅభినందనీయమన్నారు.అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎస్. కిషన్, సదానందం, డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.