ఖమ్మం మామిళ్లగూడెంలో ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
ఖమ్మం మామిళ్లగూడెంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ గండి కోటయ్య సతీమణి, గొప్ప దైవభక్తురాలు విమలమ్మ మంగళవారం ఉదయం మృతి చెందారు.అబ్కారీ శాఖ అధికారి,తన ఆప్తమిత్రుడు శ్యాంబాబు మాతృమూర్తి అయిన విమలమ్మ మృతి చెందారని తెలిసిన వెంటనే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఆమె అకాల మృతి పట్ల రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.విమలమ్మ భర్త కోటయ్య,కుమారులు ప్రేమ్ కుమార్, శ్యాంబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులను ఎంపీ పరామర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట ఏఎస్పీ రామోజీ రమేష్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జర్నలిస్టుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ తదితరులు ఉన్నారు.