
`పల్లెలో పాలన లేకుంటే అస్తవ్యస్తం!
`పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.
`పల్లె ప్రగతే దేశ అర్థిక పురోగతి.
`రెండేళ్ళుగా గ్రామ పాలన లేకపోవడంతో స్థంభించిన ప్రగతి.
`కేంద్ర నిధులు ఆగిపోయాయి.
`రాష్ట్ర నిధులకు మోక్షం లేకుండా పోయింది.
`పారిశుధ్యం పడకేసింది.
`పల్లె ప్రగతి కుంటుపడిరది.
`వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
`పల్లకు పాలనలో ప్రధమ ప్రాధాన్యత కల్పించాలి.
`గ్రామ పంచాయతీకి రాజ్యాంగంలో గొప్ప స్థానమున్నది.
`సర్పంచ్ గ్రామ ప్రధమ పౌరుడు.
`ప్రధాని, ముఖ్యమంత్రి వచ్చినా సభలకు సర్పంచ్ కు అధ్యక్ష బాధ్యతలు.
`కేంద్రం నుంచి వచ్చే నిధులలో 85 శాతం గ్రామానికే కేటాయించాలి.
`పంచాయతి రాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ సచివాలయాదే కీలక పాత్ర.
`జిల్లా పరిషత్ చైర్మన్ పదవి క్యాబినెట్ మంత్రి స్థాయి.
`కేంద్ర ప్రభుత్వం కన్నా రాజ్యాంగ పరంగా జిల్లా పరిషత్ సుప్రీం.
`అంత గొప్పది మన పంచాయతీ రాజ్ వ్యవస్థ.
హైదరాబాద్,నేటిధాత్రి: రాజులు కాలంలో మనదేశంలో స్ధానిక పాలన వుండేది. కాని అది కొంత మంది చేతుల్లో నిక్షిప్తమై వుండేది. రాజులు నియమించుకున్న వారి చేతుల్లో స్దానిక పాలన సాగుతుండేది. అది కూడా పన్నులు వసూలు చేయడానికి మాత్రమే ఆ యంత్రాంగం పనిచేసేది. తర్వాత బ్రిటీష్ కాలంలో ఆ పాలనకు స్వస్తి పలికారు. బ్రిటీష్ పాలకులు స్ధానిక స్వపరిపాలన తెచ్చారు. గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ తన కాలంలో ఈ స్దానిక స్వపరిపాలన తెచ్చారు. ఆ సమయంలో జిల్లాలు, బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1959లో 1919,1935 చట్టాలకు అనుగుణంగా స్ధానిక సంస్ధలు ఏర్పాటు చేశారు. మూడంచెల వ్యవస్ద తెచ్చారు. గ్రామ పరిపాలనను చేర్చారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని గ్రామపంచాయితీ వ్యవస్ధ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పల్లెల్లో కూడా ఎన్నికలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటూ వస్తున్నారు. గ్రామ సర్పంచ్‌కు రాజ్యాంగంలో ఎంతో గొప్ప నిర్వచనం వుంది. అదికారం కూడా వుంది. గ్రామ సర్పంచ్ మీద అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కాని సర్పంచ్ తప్పు చేశాడనుకున్నప్పుడు మాత్రమే కలెక్టర్ తొలిగిస్తారు. దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి వచ్చినా సర్పంచ్‌కు ప్రోటో కాల్ వుంటుంది. ఎందుకంటే సర్పంచ్ గ్రామ ప్రధమ పౌరుడు. రాజ్యాంగబద్దంగా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడే ఏకైక నాయకుడు. మన దేశంలో నేరుగా ప్రజల నుంచి ఇప్పుడు ఎన్నుకోబడే ఏకైన ప్రజా ప్రతినిధి సర్పంచ్. గతంలో మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు కూడా నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోబడేవారు. కాని ఆ స్దానాలలో మార్పులు తెచ్చారు. కాని సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం నేరుగా ఎన్నుకునే విధానం మార్చలేదు. గత రెండేళ్లుగా తెలంగాణలోని పల్లెలో పాలన స్ధంబించి పోయింది.. కేంద్రం నుంచి నిదులు రావడం లేదు. పల్లె పాలన పడకేసింది. పంచాయితీ రాజ్ వ్యవస్ధ చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు వుంటేనే కేంద్రం నుంచి నిధులు అందుతాయి. రెండేళ్లుగా నిధులు లేక పల్లెలు కునారిల్లుతున్నాయి. పంచాయితీ రాజ్ చట్టంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో సింహ భాగం పల్లెలకే కేటాయించాయి. కేంద్రం నుంచి జిల్లాలకు నేరుగా నిధులు అందుతాయి. కాని జిల్లా పరిషత్ ఆ నిధులలో కేవలం 5శాతం మాత్రమే వినియోగించుకోవాలి. మండలాలకు 10శాతం నిధులు పంపకాలు చేయాలి. గ్రామ పంచాయితీలకు 80శాతం నిధులు ఇవ్వాలి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా గ్రామ పంచాయితీకే చెందాలి. మన దేశంలో స్ధానిక సంస్ధలకు ఎంతో గొప్ప గౌరవం వుంది. అంత కన్నా విలువ వుంది. కొన్ని సందర్భాలలో పార్లమెంటు కన్నా, జిల్లా పరిషత్ స్టాండిరగ్ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యత వుందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ పల్లెలు పాలన కోసం ఎదరు చూస్తున్నాయి. పల్లె పాలన పూర్తయి రెండేళ్ల కాలానికి వస్తోంది. పల్లెతోపాటు, మిగతా పంచాయితీ రాజ్పాలన పూర్తయింది. మండల, జల్లా స్దాయి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. మన దేశంలో పల్లెలే పట్టుగొమ్మలు. మన దేశంలో సుమారు 70శాతం జనాభా పల్లెల్లోనే వుంటుంది. ఐదు లక్షల గ్రామాలతో కూడిన అతి పెద్ద దేశం మనది.అలాంటి మన దేశంలో స్దానిక పాలనపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వుంటాయి. స్దానిక సంస్ధల గడువు ముగిసినా, ప్రత్యేక అదికారుల చేత పాలన సాగిస్తుంటారు. ఎన్నికల నిర్వహణ గాలికి వదిలేస్తుంటారు. ప్రజలు ఎన్నికలెప్పుడు అని అడిగినా పట్టించుకోరు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రబుత్వ హయాంలో ఎన్నికలు సమాయానికి నిర్వహించలేదు. నోడల్ అధికారులతో స్దానిక పాలన కొన్నేళ్లపాటు సాగించారు. ఇందుకు రాజకీయ పరమైన కారణాలు వుంటుంటాయి. ఎన్నికలు నిర్వహిస్త తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా? రావా? అన్న మీమాంసలో అధికార పార్టీలు ఆలస్యం చేస్తుంటాయి. స్దానిక సంస్ధల ఎన్నికల్లో తాము స్వీప్ చేస్తామన్న మన్మకం వచ్చినప్పుడు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగానలో కనిపిస్తోంది. కాకపోతే తెలంగాణ స్ధానిక సంస్ధల ఎన్నికల ఆలస్యానికి బిసి రిజర్వేషన్ల అంశం అడ్డుగా మారుతోంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 42 రెండు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శఫధం చేశారు. అందుకు అడ్డంకులుంటాయని తెలుసు. వాటిని అదిగమిస్తామన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి వుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకే ఈ అస్త్రాన్ని వినియోగించుకున్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా, రాజ్యాంగ సవరణ జరగకుండా 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అలవి కాని హమీని ఇస్తోందని చెప్పలేదు. ఆ సమయంలో బిఆర్ఎస్ను ప్రజలు నమ్మేలా లేరన్న వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేం సాదించి చూపిస్తామని మరింత గట్టిగా చెప్పుకునే అవకాశం వుంటుంది. కేంద్రంలో వచ్చేది మేమే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం వుంది. కేంద్రంలో కూడా మేమే వస్తామని మరింత చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు కల్పించినట్లౌతుందని బిఆర్ఎస్, బిజేపిలు సైలెంటుగా వున్నాయి. అదే కాంగ్రెస్‌కు వరమైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 42 శాతం రిజర్వేషన్ ఎలా అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి, కేంద్రానికి పంపడం జరిగింది. అది అయ్యేది కాదని కాంగ్రెస్‌కు కూడా తెలిసిపోయింది. స్దానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టు డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 31 లోగా స్ధానిక సంస్ధల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌కు ఈ తీర్పు సంకటకంగా మారింది. ప్రజల నుంచి బిసి రిజర్వేషన్లు స్దానిక సంస్ధల ఎన్నికల్లో అమలు చేయాలని మరింత ఒత్తిడి వస్తోంది. బిసిల నుంచి కూడా పెద్దఎత్తున ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు వెనకడుగు వేసే పరిస్దితి కనిపించడం లేదు. వాయిదాకు కూడా వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్దితుల్లో లేదు. రిజర్వేషన్లును పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఈ విషయాన్ని ఎన్నికల ముందే చెబితే బాగుండేది. కాని అప్పుడు చెబితే ప్రజలు నమ్మేవారు కాదు. ఇప్పుడు నమ్మించడానికి అవకాశం లేకుండాపోయింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అది కూడా చట్ట సమ్మతం కాదన్నది అందరికీ తెలుసు. ఏదో రకంగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదికారంలోకి వచ్చింది. అదృష్టం కొద్ది స్ధానిక సంస్దల పాలన అప్పటికే పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తారన్న ఆలోచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. కాని ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ పోయింది. ఇప్పఇకైనా సమయం ఆసన్నమైందనుకుంటే, ఆర్డినెన్స్ జారీ చేసినా జరుగుతాయన్న నమ్మకం లేకుండా పోతోంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో 15వేల మంది సర్పంచ్‌లు, 6వేల మంది ఎంపిటిసిలు, 500 మంది జడ్పీటీసిలుండేవారు. అందులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చేవి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగేది. స్దానిక పాలన కూడా మొత్తం కాంగ్రెస్ చేతుల్లోకే వచ్చేది. కాని ఆలస్యం చేశారు. అయితే ఆ సమయంలో బిజేపి కూడా 8 పార్లమెంటు స్దానాలు గెల్చుకొని వుంది. అదే సమయంలో స్ధానిక సంస్దల ఎన్నికలు నిర్వహిస్తే, బిజేపి పుంజుకునే అవకాశం వుండేది. అందుకే కొంత కాలం ఆగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందేమో అన్న అనుమానం పార్టీలో వ్యక్తమౌతోంది. కాకపోతే ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు మొదలౌతున్నాయి. ఇక ఈ సమస్య ఇలా వుంటే గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన వాళ్లకు బకాయిలు పెండిరగ్లో వున్నాయి. ఎన్నికల ముందు వారికి బకాయిలు అందలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం విచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిధులు రావడం లేదు. 14వ ఆర్దిక సంఘం నిధులు విడుదలైతే తప్ప బకాయిలు అందవు. అవి అందాలంటే పంచాయితీ ఎ న్నికలు నిర్వహించాలి. ఏం జరగుతుందో చూడాలి.