
CPI(M) Mass Line
గ్రామాలలో పడకేసిన…శానిటేషన్ పనులను వేగవంతం చేయాలి
సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రామాలలో శానిటేషన్ పనులు మొత్తం పడక వేసిన పరిస్థితి నెలకొని ఉందని సిపిఐ ఎంల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న అన్నారు. కేసముద్రం కేంద్రంలో ఎంపీడీవోకు ప్రతినిధి బృందంగా వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మునిసిపాలిటీ పరిధిలో చెత్తాచెదారం పేరుకుపోయి మురికి వాసనతో కంపు కొడుతున్నటువంటి తరణం నెలకొని ఉందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విష జ్వరాలతో ముఖ్యముగా మలేరియా, డెంగ్యూ వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నరని అన్నారు. ఈ పరిస్థితుల్లో
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ గ్రామస్థాయి నుండి సర్వేలు నిర్వహించి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ద్వంద వైఖరిని విడనాడి ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించాలని డిమాండ్ చేశారు. మాది సంక్షేమం ప్రభుత్వం అంటున్న రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలలో ఏమాత్రం నిజాయితీ లేదనిఅన్నారు. మల్టీపర్పస్ వర్కర్లకు కనీసం జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదని స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీకి నిధులు లేక కనీసం బ్లీచింగ్ పౌడర్లు దోమల నివారణ ఫాగింగ్లు చేయించే పరిస్థితి లేదన్నారు. మురికి కాలువలో పేరుకుపోయిన మురికిని తొలగించే పరిస్థితి లేదని, వివిధ పంచాయతీలో ట్రాక్టర్లు రిపేర్లు ఉన్నాయని పేరుతో చెత్తాచెదారం పేర్కపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉందన్నారు. అందుకనే మండల అధికారులు స్పెషల్ ఆఫీసర్లు తక్షణమే దృష్టిని కేంద్రీకరించి గ్రామాలలో పేర్కొన్న చెత్తచెదారాన్ని తొలగించి శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేసారు. ఇంకా ఈ కార్యక్రమం లో సిపిఐ (ఎంల్) మాస్ లైన్ మహబూబాబాద్ డివిజన్ నాయకులు ఆవుల కట్టయ్య, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి కండల రంగయ్య, ఏ ఐ పి కే ఎం ఎ ఎస్ జిల్లా నాయకులు పెరుమాండ్ల జానకిరాములు,వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.