మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి .వెంకటేశ్వర్ రావు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలo లోని కుందారం మరియు ఎల్కoటి గ్రామ పంచాయతీలను శనివారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర రావు మొబైల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ లో భాగంగా సందర్శించడం జరిగింది. గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి ప్రతీ ఇంటి నుండి పొడి చెత్త మరియు తడి చెత్త ను సేకరించి గ్రామ పంచాయతీల ట్రాక్టర్ ల ద్వారా సేనిగ్రేషన్ షెడ్ కు తరలించాలని సూచించారు. గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కనబడకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రాబోతున్న వర్షాకాల దృశ్య మురికి గుంతలు,కలువలు,మడుగులలో ఇలా నీరు నిల్వకాకుండా జాగ్రత్తగా వహించాలని, నీరు నిల్వ అవటం వల్ల దోమలు, ఈగల బెడద పెరిగి ప్రజలు విషజ్వరాల బారినపడటం జరుగుతుందని అశ్రద్ద చేయకూడదని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సూచించారు.గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అపుడే ఆరోగ్యాలు బాగుంటాయని తెలిపారు.కంపోస్టు ఎరువుల తయారీ విధానం పరిశీలించి తగు సూచనలు చేశారు. గ్రామాలలోని నర్సరీలలో మొక్కలకు ప్రతీ రోజూ నీరు అందించాలని సూచించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర రావు,జైపూర్ మండల పంచాయితి అధికారి శ్రీపతి బాపు రావు, కుందారం పంచాయితి కార్యదర్శి విష్ణువర్ధన్, ఎల్కంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్నిగ్ధ, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.