‘దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో MGNREGA పథకం క్రింద రూ.44.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.