
ముత్తారం :- నేటి ధాత్రి
ఎంపీటీసీ ల పదవి కాలం పూర్తి అయిన సందర్బంగా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామ ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ పదవి విరమణ సందర్భంగా ఎంపిటిసి దంపతులను పూలమాల మరియు శాలువాలతో అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ అనంతరం వారు మాట్లాడుతూ మాతో కలిసి నడిచినందుకు మాకు తోడుగా వున్నందుకు మమ్మల్ని ఆదరించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు సేవచేసేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం అని గ్రామస్తులకు ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య వెంకటలక్ష్మి సింగల్ విండో డైరెక్టర్. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన, మాజీ వార్డు సభ్యుడు ఆకోజు అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాండ్ర మల్లేష్ ,గోస్కుల రమేష్, చట్ల మొగిలి ,బందెల మల్లయ్య, చొప్పరి సదయ్య రత్న పీరయ్య, రత్న రాజారాం. మరియు యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరగోని అంజి మరియు యూత్ నాయకులు బొమ్మల భాస్కర్, దేశిని హరీష్ ,గూడేపు స్వామి. పాల్గొని ఎంపీటీసీ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఎన్నో ఉన్నత రాజకీయ పదవులు అలంకరించాలని ప్రజలు కోరారు