బదిలీ పై వెళ్తున్న తునికి బండల టీచర్ కు గ్రామస్తులు వీడ్కోలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆళ్లపల్లి మండలం తునికిబండల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలు పని చేసి ఈ మధ్యకాలంలో బదిలీపై వెళ్లిన హెడ్మాస్టర్ ఇస్లావత్ నరేష్ నాయక్ ను తునికి బండల గ్రామస్తులు శుక్రవారం వారిని శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.గ్రామస్తులు మాట్లాడుతూ నరేష్ మా గ్రామంలోకి వచ్చిన తర్వాత మా బడి రూపు రేఖలే మారిపోయాయని, వచ్చినప్పుడు 11 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు 40 మంది పిల్లలు స్కూల్లో ఉన్నారని, రెండు ఉత్తమ అవార్డులు పొందారని తెలిపారు. బడికి రాని పిల్లల కోసం ప్రతి రోజు గ్రామంలో గాలింపు చేసి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్ళేవారని స్కూల్ ను మోడల్ స్కూల్ గా మార్చారని, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లోకి అరుగురు విద్యార్థులను పంపించారని, ప్రతి సంవత్సరం విద్యార్థులు గురుకులంలో సీట్ సాధి స్తున్నారని ఇలాంటి మంచి ఉపాధ్యాయుడు మా గ్రామం నుండి బదిలీపై వెళ్లినందుకు చాలా బాధపడుతున్నాము అని వారు ఆ టీచర్ని కొనియాడారు. అనంతరం గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు నరేష్ మాట్లాడుతూ నిరు పేద కుటుంబం నుండి వచ్చిన నేను ఈ గ్రామస్తులు చాలా చక్కగా చూసుకున్నారని, ప్రతి కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించారని, జీవితంలో ఈ గ్రామాన్ని ఈ గ్రామస్తులనీ మర్చిపోనని అన్నారు . ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్య క్షులు జోగ రాంబాబు, ఉపాధ్యాయులు బాలాజీ, ముత్తయ్య, రాము, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!