పల్లెల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో వారంతా గురువారం వెల్దండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తులతో మద్దతుదారులు, నాయకులు, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వెల్దండ పంచాయతీలో బిఆర్ఎస్ అభ్యర్థి రాయి కోటి వినోద బాలరాజ్ తమ గుర్తులకు ఓటు వేయాలని కోరారు.

ఇటీ ప్రచార భాగంలో బిఆర్ఎస్ అభ్యర్థి రాయి కోటి వినోద బాలరాజ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ కార్యకర్తలు మరియు మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా గాజుల కృష్ణ సజావుద్దీన్ దత్తు తోఫిక్ సంజీవు గడ్డం అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు,
